Nelloreలో AP Tourism DGM భాస్కర్ ఘాతుకం: ఆఫీస్‌లోనే మహిళా ఉద్యోగిపై జులుం

నెల్లూరు: నెల్లూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జిల్లా స్థాయి కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిపై దాడికి పాల్పడ్డాడో ఉన్నతాధికారి. తోటి ఉద్యోగులందరూ చూస్తుండగానే ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి పడేశాడు. చేతికి అందిన వస్తువులతో చితగ్గొట్టాడు. కార్యాలయంలో సీసీటీవీ కెమెరా ఉందనే విషయం తెలిసి కూడా ఆ ఉద్యోగినిపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడతను. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఆ అధికారిపై కేసు నమోదు చేశారు.

ఆ అధికారి ఆ స్థాయిలో ఆమెను చితగ్గొట్టడానికి కారణం- ముఖానికి మాస్క్ వేసుకోవాలని సూచించడమే. ఈ నెల 27వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బహిర్గతం అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉద్యోగినిపై దాడికి పాల్పడిన అధికారిపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే స్పందించాలని నినదిస్తున్నారు.

Andhra Pradesh: Woman employee was attacked inside the office by a senior officer in Nellore

ఆ అధికారి పేరు భాస్కర్. నెల్లూరు జిల్లా పర్యాటకాభివృద్ధి సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. అయినప్పటికీ.. ఈ నెల 27వ తేదీన భాస్కర్. మాస్క్ ధరించకుండా విధులకు హాజరయ్యాడు. తన కింది స్థాయి ఉద్యోగులతో సమావేశం అయ్యాడు. దీన్ని చూసిన ఉద్యోగిని ఒకరు.. మాస్క్ ధరించాలని సూచించారు.

Recommended Video

    #Watch 200 years Ancient Lord Shiva Temple Found in AP’s Nellore

    ఆమె అలా చెప్పడమే తప్పయింది. తనను మాస్క్ వేసుకోవాలని సూచించినందుకు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. నాకు వైరస్ సోకిందనుకుంటున్నావా? నాకే ఎదురు చెబుతావా? అంటూ ఆ ఉద్యోగినిని తీవ్రంగా కొట్టాడు. జుట్టు పట్టుకుని ఈడ్చేశాడు. చేతికి అందిన వస్తువులను ఇష్టానుసారంగా కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అనంతరం బాధిత ఉద్యోగిని నెల్లూరు ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో భాస్కర్‌పై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+