చెన్నైలో ఆంధ్రా లేడీ టెక్కీ ఆత్మహత్య: అదే కారణం అంటున్న పోలీసులు !
జీవితంపై విరక్తి చెందిన లేడీ టెక్కీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నై నగరంలోని వేలచెర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రపద్రేశ్ కు చెందిన మౌనిక (24) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని బుధవా
చెన్నై: జీవితంపై విరక్తి చెందిన లేడీ టెక్కీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నై నగరంలోని వేలచెర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రపద్రేశ్ కు చెందిన మౌనిక (24) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని బుధవారం పోలీసులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మౌనిక చెన్నై చేరుకుని తరమణి ప్రాంతంలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సొంత ఊరిలో ఈమె కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. మౌనికకు ఇటీవల ఓ పెళ్లి సంబంధం చూశారని తెలిసింది.

ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని మౌనిక ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారని సమాచారం. అయితే పెళ్లి పనులు మొదలు పెట్టడంతో ఆమె తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని స్నేహితులకు చెప్పిందని పోలీసులు అంటున్నారు.
వేలచెర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ లోని లేడీస్ హాస్టల్ లో నివాసం ఉంటున్న మౌనిక తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మౌనిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications