వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కారుకు నిమ్మగడ్డ భారీ ఊరట- అది కోడ్ ఉల్లంఘన కాదంటూ క్లారిటీ...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే నిత్యావసర సరుకులను కొనుక్కోలేని పరిస్ధితుల్లో ఉన్న పేదలకు వైసీపీ సర్కారు వెయ్యి రూపాయలను సాయంగా ఆందిస్తోంది. అయితే దీన్ని వాలంటీర్లతో ఇళ్లకే పంపిస్తుండగా.. కొన్ని చోట్ల మాత్రం వైసీపీ తరఫున స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు పంచుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేయడంతో ఇవాళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

కరోనా సాయంపై నిమ్మగడ్డ క్లారిటీ..

కరోనా సాయంపై నిమ్మగడ్డ క్లారిటీ..


ఏపీలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ పరిస్ధితుల్లో ప్రభుత్వం తరఫున వాలంటీర్లతో పేదలకు ఆర్ధిక ప్రయోజనం అందించడం, స్వప్రయోజనాల కోసం ప్రజల మద్దతు కోరడం వంటివి జరుగుతున్నట్లు తమకు అందిన ఫిర్యాదులపై విచారణ కోరుతూ కలెక్టర్లకు, ఎన్నికల పరిశీలకులకు లేఖలు రాసినట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో కొన్నిరోజులుగా వెయ్యి రూపాయల పథకంపై ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్న విపక్షాలకు గట్టి షాక్ తగిలినట్లయింది.

ప్రస్తుతం కోడ్ అమల్లోనే లేదు..

ప్రస్తుతం కోడ్ అమల్లోనే లేదు..

నిమ్మగడ్డ రమేష్ వ్యాఖ్యలతో రాష్ట్ర్ల్రంలో స్ధానిక సంస్దల ఎన్నికల వాయిదా నేపథ్యంలో కోడ్ అమల్లో లేదనే విషయంపై రాజకీయ పార్టీలకు మరోసారి క్లారిటీ వచ్చినట్లయింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్దానిక ఎన్నికల వాయిదా పిటిషన్ వేసినప్పుడే ఈ విషయం తేలిపోయింది. ఎన్నికల వాయిదా తర్వాత కోడ్ అమల్లో అర్ధం లేదని, అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు, కొత్త పథకాలు తీసుకునేటప్పుడు రాష్ట్ర్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాలని సుప్రీం ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ తాజాగా విపక్షాలు వెయ్యి రూపాయల పంపిణీపై ఈసీకి ఫిర్యాదులు చేయడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

 కోడ్ లేకపోయినా ప్రచారంపై నిషేధమే..

కోడ్ లేకపోయినా ప్రచారంపై నిషేధమే..

ఏపీలో ఎన్నికల కోడ్ లేకపోయినప్పటికీ ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతుందని ఎస్ఈసీ రమేష్ కుమార్ అభ్యర్ధులకు మరో క్లారిటీ ఇచ్చారు. అభ్యర్ధులు వారి స్వప్రయోజనాల కోసం ప్రచారం చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా భావించి పరిగణనలోకి తీసుకుంటామని రమేష్ కుమార్ తెలిపారు. అంటే కోడ్ లేకపోయినా ఎన్నికల ప్రచారంతో పాటు ఇతర అంశాలు తన పరిధిలోనే ఉన్నట్లు నిమ్మగడ్డ మరోసారి స్పష్టం చేసినట్లయింది.

ఫిర్యాదులు స్వీకరిస్తాం..

ఫిర్యాదులు స్వీకరిస్తాం..

ఎన్నికల కోడ్ అమల్లో లేకపోయినా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, ప్రలోభాలు వంటి అంశాలపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వస్తే స్వీకరిస్తామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఫిర్యాదులు అందినప్పుడు వాటిపై అధికారులు క్షేత్రస్థాయిలో నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని రావాలన్నారు.

సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని రమేష్ కుమార్ పేర్కొన్నారు.

English summary
andhra pradesh state election commission on monday clarifies on rs.1000 financial help given to poor in during coronavirus lock down. state elecion commissioner nimmagadda ramesh kumar reacted on complaints from opposition parties on financial help distributed to poor by ysrcp leaders and said the model code of conduct is not in force during this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X