చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus : ఊపిరి పీల్చుకున్న జ్యోతి కుటుంబం.. చైనా నుంచి ఇండియాకి చేరిన తెలుగమ్మాయి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ బయటపడిన చైనాలోని వుహాన్ పట్టణంలో చిక్కుకుపోయిన తెలుగమ్మాయి అన్నెం జ్యోతి కథ సుఖాంతమైంది. గురువారం భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో ఆమె స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం 14 రోజుల అబ్జర్వేషన్ నిమిత్తం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జ్యోతి కుటుంబ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. జ్యోతితో పాటు మొత్తం 76 మంది భారతీయులు,మరో 36 మంది విదేశీ పౌరులు ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఢిల్లీకి చేరుకున్నారు.

చైనాలోనే కర్నూలు యువతి: ఆమెకు కేంద్రమంత్రి హామి, జ్యోతి కోసం కాబోయే భర్త యాగంచైనాలోనే కర్నూలు యువతి: ఆమెకు కేంద్రమంత్రి హామి, జ్యోతి కోసం కాబోయే భర్త యాగం

జ్వరం కారణంగా అక్కడే ఉండిపోయిన జ్యోతి..

జ్వరం కారణంగా అక్కడే ఉండిపోయిన జ్యోతి..

కరోనా వైరస్ కారణంగా చైనాలో చిక్కుకుపోయిన 654 మంది భారతీయులను ఇటీవలే ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను చైనాకు పంపించి వారందరినీ ఢిల్లీకి తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో కర్నూలుకు చెందిన అన్నెం జ్యోతి జ్వరంతో బాధపడుతుండటతో.. కరోనా లక్షణాలున్నాయని అనుమానించారు. దాంతో ఆమెను అక్కడే వదిలేసి వచ్చారు. ఆమెతో పాటు మరో 9 మంది భారతీయులు కూడా అక్కడే చిక్కకుపోయారు. వీరంతా ఎప్పుడెప్పుడు భారత్ చేరుకుంటామా అని ఇన్నాళ్లు ఆతృతగా ఎదురుచూశారు.

జ్యోతి తల్లి ఏమన్నారు..

జ్యోతి తల్లి ఏమన్నారు..

జ్యోతి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని ఆమె తల్లి ప్రమీలా దేవీ తెలిపారు. చైనా నుంచి జ్యోతి ఢిల్లీకి చేరుకుందని.. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుకు తరలించారని అన్నారు. గతంలో చైనా నుంచి వచ్చినవారిని కూడా ఐసోలేషన్‌లో పెట్టారని.. కాబట్టి తమ కుమార్తె ఇంటికి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చునని అన్నారు. జ్యోతితో ఎక్కువసేపు మాట్లాడలేనందునా.. ఎక్కువ వివరాలు వెల్లడించలేకపోతున్నామని చెప్పారు.

ఆ సంస్థ తరుపున ట్రైనింగ్ కోసం వుహాన్‌కు..

ఆ సంస్థ తరుపున ట్రైనింగ్ కోసం వుహాన్‌కు..

కర్నూలులోని బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన అన్నెం జ్యోతి(20) పానెల్ ఆప్టోడిస్‌ప్లే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్(POTPL) కంపెనీ తరుపున ట్రైనింగ్ కోసం చైనాలోని వుహాన్‌కి వెళ్లారు. ఆమెతో పాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్ట్ అయిన మరికొంతమంది విద్యార్థులు కూడా తిరుపతి యూనిట్ నుంచి అక్కడికి వెళ్లారు. అక్కడ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తిరుపతిలోని తమ ఎల్‌సీడీ టీవీ స్క్రీన్ మాన్యుఫాక్చరింగ్‌లో వీరు పనిచేయాల్సి ఉంది. అయితే ఇంతలో కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో.. వీరు అక్కడే చిక్కుకుపోయారు. జ్యోతితో పాటు ట్రైనింగ్ కోసం వెళ్లిన సత్యసాయి కృష్ణ అనే యువకుడు కూడా వుహాన్‌లో చిక్కుకుపోయాడు. జనవరి 31న భారత్ నుంచి మొదటి విమానం వెళ్లినప్పుడు.. వీరిద్దరు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో.. వీరిని అక్కడే వదిలేసి వచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2న మరో విమానం వెళ్లినప్పుడు కూడా వీరిని విమానంలోకి అనుమతించలేదు. దీంతో ఇన్నిరోజులుగా వీరు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

ఊపిరి పీల్చుకున్న కుటుంబం..

ఊపిరి పీల్చుకున్న కుటుంబం..


జ్యోతి రాక కోసం ఆమె కుటుంబ సభ్యులతో పాటు,ఆమెకు కాబోయే భర్త అమరనాథ్ రెడ్డి ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. జ్యోతిని ఇండియా రప్పించడం కోసం అతను తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఎట్టకేలకు జ్యోతి ఇండియా చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మార్చి 15న జ్యోతి-అమరనాథ్ రెడ్డిల పెళ్లి జరగాల్సి ఉండగా.. కొన్ని వారాల వరకు వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. జ్యోతి స్వగ్రామానికి వచ్చి కోలుకున్న తర్వాత పెళ్లి తేదీని నిశ్చయిస్తామని చెప్పారు.

English summary
Annem Jyothi, who had sent out a plea for help after she and her colleagues were stopped from being evacuated from China’s Wuhan, has finally returned to India. Nearly four weeks back, 654 people were airlifted out of the coronavirus-hit Wuhan city by the Indian government. But ten Indian citizens, including Jyothi, who were eagerly waiting to return home were stopped by Chinese officials due to their high body temperature levels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X