చంద్రబాబు జీతం ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు, విభజిత రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన ఎంత జీతం తీసుకుంటారు? దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఎంత వేతనం ఉంటుంది? అనే వివరాలను తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా సీఎంల వేతనం ఉంటుంది. వారి రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను బట్టి ఆధారపడివుంటుంది.
విమానం, హెలికాప్టర్
చంద్రబాబుకు ప్రభుత్వం ఇంటిని ఇస్తుంది. వాహనంతోపాటు భద్రతా సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే దేశ విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా సొంత విమానాలను, హెలికాప్టర్లను కలిగివున్నాయి. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఆ రాష్ట్ర గవర్నర్ తోపాటు ముఖ్యమంత్రి కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. సమయం ఆదా చేయడానికి వీటిని ఎక్కువగా వాడుతుంటారు. రాష్ట్రంలో పయనించేందుకు హెలికాప్టర్, రాష్ట్రం బయటకు విమానాన్ని వాడతారు.

అదనంగా అన్ని సౌకర్యాలు
ఏపీలో చంద్రబాబుకు వేతనాన్ని రూ.3,35,000గా నిర్ణయించారు. అదనంగా ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. చంద్రబాబుతోపాటు ప్రమాణ స్వీకారం చేసిన ఒడిసా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ రూ.1.60 లక్షలు తీసుకుంటారు. అతి తక్కువగా దేశంలో త్రిపుర ముఖ్యమంత్రి వేతనం ఉంది. ఆయనకు రూ.1.05 లక్షలు తీసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రం అత్యధిక వేతనం ఉంది. ఆయన రూ.4.10 లక్షలు తీసుకుంటున్నారు. దేశంలోనే తొలిస్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత వేతనం తీసుకుంటున్నారో తెలుసుకుందాం.
తెలంగాణ - రూ. 4,10,000
ఆంధ్రప్రదేశ్ - రూ. 3,35,000
గుజరాత్ - రూ. 3,21,000
హిమాచల్ ప్రదేశ్ - రూ. 3,10,000
హరియాణా - రూ. 2,88,000
జార్ఖండ్ - రూ. 2,55,000
ఢిల్లీ - రూ. 3,90,000
ఉత్తరప్రదేశ్ - రూ. 3,65,000
మహారాష్ట్ర - రూ. 3,40,000
పశ్చిమ బెంగాల్ - రూ. 2,10,000
ఉత్తరాఖండ్ - రూ. 1,75,000
రాజస్థాన్ - రూ. 1,75,000
ఒడిశా - రూ. 1,60,000
మేఘాలయ - రూ. 1,50,000
అరుణాచల్ ప్రదేశ్ - రూ. 1,33,000
అస్సాం - రూ. 1,25,000
తమిళనాడు - రూ. 2,05,000
కర్ణాటక - రూ. 2,00,000
సిక్కిం - రూ. 1,90,000
కేరళ - రూ. 1,85,000
మణిపూర్ - రూ. 1,20,000
నాగాలాండ్ - రూ. 1,10,000
త్రిపుర - రూ. 1,05,500
మధ్యప్రదేశ్ - రూ. 2,30,000
ఛత్తీస్‌గడ్ - రూ. 2,30,000
పంజాబ్ - రూ. 2,30,000
గోవా - రూ. 2,20,000
బీహార్ - రూ. 2,15,000












Click it and Unblock the Notifications