టీటీడీ కొత్త నిర్ణయం: వారికి లక్కిడిప్ టోకెన్లు నో..!!

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. బుధవారం నాడు 76,772 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,293 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.82 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 19 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు శ్రీవారి సేవకులు.

Anga Pradakshina tickets for the locals of Tirupati Urban and Tirumala will be allotted by e-Dip

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.

4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శనివారం తిరుమల, తిరుపతిల్లో నివసించే స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లను కూడా ఇకపై లక్కీడిప్ ద్వారా మంజూరు చేయాలని నిర్ణయించారు.

అంగప్రదక్షిణ టికెట్లు కావలసిన భక్తులు ఇకపై రెండు రోజులు ముందుగానే.. అంటే గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆధార్ కార్డు నంబర్‌తో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా వాళ్లకు టికెట్లను కేటాయిస్తారు.

లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. అవే వివరాలను ఆన్‌లైన్‌లోనూ పొందుపరుస్తారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆన్‌లైన్‌లోనే 500 రూపాయల మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డును చూపించి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లను పొందవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులను శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అనంతరం భక్తులు చెల్లించిన 500 రూపాయల డిపాజిట్ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుంది.

తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కానీ భక్తులు లక్కీడిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందితే.. వారికి ఈ 500 రూపాయల డిపాజిట్ మొత్తాన్ని టీటీడీ తిరిగి చెల్లించదు. అంగప్రదక్షిణకు అనుమతించదు. తిరుమల, తిరుపతి అర్బన్ ప్రాంతాల్లో నివసించే స్థానికులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది టీటీడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+