కల్యాణ్ రామ్ కు కోపమొచ్చిందా?
కల్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్న బింబిసార్2పై భారీగా క్రేజ్ నెలకొంది. దర్శకుడు వశిష్ట బింబిసార సమయంలోనే సీక్వెల్ కు పాయింట్ రాసిపెట్టుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేశారు. అయితే బింబిసార్ విడుదలైన వెంటనే సీక్వెల్ తెరకెక్కించడంలో జాప్యం జరిగింది. ఈలోగా కల్యాణ్ రామ్ మరో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. దీంతో దర్శకుడు వశిష్ట కూడా అగ్ర కథానాయకులకు కథలు చెపుతూ వాటిపై పనిచేస్తున్నాడు.

అయితే కల్యాణ్ రామ్ కు, దర్శకుడు వశిష్టకు మధ్య కొంత గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. బింబిసార్ 2 చిత్రానికి బడ్జెట్ పెట్టేందుకు జీ స్టూడియో ముందుకు వచ్చి రూ.100 కోట్లపైనే ఆఫర్ ఇచ్చింది. దీంతో వెంటనే సీక్వెల్ ను రూపొందించాలని కల్యాణ్ రామ్ భావిస్తున్నారు. ఈలోగా వశిష్ట చిరంజీవికి ఒక ఫాంటసీ కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. దీంతో బింబిసార 2 చేయలేని పరిస్థితి. అంతేకాకుండా కల్యాణ్ రామ్ కు, వశిష్టకు మధ్య కొన్ని ఇష్యూలున్నట్లు సమాచారం.

రెండో సినిమాగా వశిష్ట బింబిసార 2 కాకుండా మరో సినిమా చేస్తే కల్యాణ్ రామ్ కు తన రెమ్యునరేషన్ లో 40 శాతం ఇవ్వాలనే ఒప్పందం జరిగింది. బింబిసార్ 2కు వేరే దర్శకుణ్ని పెట్టుకొని సినిమా చేస్తే తనకు కూడా కొంత చెల్లించాలని వశిష్ట డిమాండ్ చేస్తున్నారు. అయితే దీన్ని సత్వరమే పరిష్కరించుకొని సీక్వెల్ సిద్ధం చేయబోతున్నాడు కల్యాణ్ రామ్. రొమాంటిక్ సినిమా దర్శకుడైన అనిల్ పాడూరి పేరును పరిశీలిస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ వర్క్ లో అతనికి మంచి అనుభవం ఉంది. కల్యాణ్ రామ్, వశిష్ట ఇష్యూ పరిష్కారమవగానే సీక్వెల్ పట్టాలెక్కనుంది.












Click it and Unblock the Notifications