మహేష్ బాబు మరో 'భోళాశంకర్'!

వరుసగా వచ్చే పరాజయాలు హీరోలు, దర్శకులకే కాదు.. నిర్మాతల ఇమేజ్ కూడా మసకబారేలా చేస్తాయి. అనిల్ సుంకర కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే వున్నారు. దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి నిర్మాత అనిల్. భారీ చిత్రాలకు చిరునామాగా ఉండేవారు. అయితే ఆయనకు వరుసగా అపజయాలు చుట్టుముట్టాయి.

రాజేష్ దండాతో కలసి చిన్న సినిమా సామజవరగమనా తీయగా మంచి హిట్ అయింది. ఆయన సొంత బ్యానర్ నుంచి వచ్చిన ఏజంట్, భోళా శంకర్ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఏ సినిమా చేయాలా? ఎవరితో చేయాలా? అసలు ఎటువంటి ప్రాజెక్టు చేపట్టాలా? అనే ఆందోళనలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయనకు మహేష్ బాబు నుంచి పిలుపు వచ్చింది. మంచి కథ వుంటే చూడండి, సినిమా చేద్దామని ప్రిన్స్ చెప్పడంతో నిరాశలో వున్న అనిల్ కి మహేష్ నుంచి వచ్చిన ఈ మాట మంచి ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు.. నిరుత్సాహాన్ని తొలగించింది.

anil sunkara next movie update

వీరిద్దరిదీ మంచి కాంబినేషన్. దూకుడు, ఆగడు, సరిలేరు నీకెవ్వరు చేశారు. ఇప్పుడు మంచి కథ కుదిరితే మళ్ళీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అనిల్ సుంకర అఖిల్ హీరోగా రూ.70 కోట్ల బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజంట్ నిర్మించాడు. విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ రావడంతోపాటు సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ నిర్మించి విడుదల చేశారు. ఇది కూడా సేమ్. మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ కావడంతో ఎటువంటి సినిమాలు చేయాలా? అనే డైలామాలో పడ్డ అనిల్ కు ప్రస్తుతం మహేష్ బాబు భరోసా ఆక్సిజన్ లా పనిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+