ఏపీలో తొలుత మూడు, నాలుగు చోట్ల అన్న క్యాంటీన్లు
హైదరాబాద్: తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్న క్యాంటీన్లను (ఎన్టీఆర్ క్యాంటీన్లు) ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ అన్న క్యాంటీన్లు రాష్ట్రంలోను మూడు, నాలుగు ప్రాంతాల్లో తొలుత ప్రారంభించనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలలో దీనిని తొలుత చేపట్టనున్నారు.
తొలుత ఇక్కడ ప్రయోగాత్మకంగా నెలకొల్పిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో పలుచోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. అన్న క్యాంటీన్లలో ఫలహారం, భోజనం ఉండనుంది.

ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే మూడు, నాలుగు సెంటర్లలలో ప్రభుత్వం ప్రయోగాలు చేయనుంది. మొదటి సెంటర్‌లో కేవలం ఫలహారం మాత్రమే ఇస్తారు. రెండో సెంటర్‌లో ఫలహారం, మధ్యాహ్నం భోజనం పెడతారు. మూడో సెంటరులో మూడు పూటలా భోజనం పెడతారు.
ఇలా తొలుత మూడు నాలుగు సెంటర్లలో ప్రయోగాలు చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు. అన్న క్యాంటీన్లకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications