వైసీపీ: ఎమ్మెల్సీలుగా కృష్ట సోదరుడు, ఉమ్మారెడ్డి

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల కోటా కింది ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణా జిల్లా కోటాలో అభ్యర్థిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, గుంటూరు జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరును ప్రకటించారు.

శేషగిరిరావు ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణకు సోదరుడు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన ఆదిశేషగిరిరావుకు గత 40 ఏళ్లుగా విజయవాడతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆదిశేషగిరిరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా, ఏ ఎన్నికల్లో పోటీలో నిలవలేదు.

Announcement of MLC candidates for Local Bodies

గతంలో శేషగిరిరావు ఏఐసీసీ కల్చరల్ కమిటీ కన్వీనర్‌గా, పీసీసీ జనరల్ సెక్రటరీగా 10 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల సభ్యులు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

జిల్లా వాసులకు అందుబాటులో ఉంటూ ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. 1982లో విజయవాడలో రాజ్-యువరాజ్ థియేటర్లను ప్రారంభించి, 15 ఏళ్లపాటు నిర్వహించారు. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, సింహాసనం సినిమాలను ఆదిశేషగిరిరావు నిర్మించారు.

Announcement of MLC candidates for Local Bodies

గతంలో ఫిలిం పెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్... 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన గెలిచిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+