తిరుమలలో చూసి తీరాల్సిన తెప్ప తిరునాళ్లు..: ఘనంగా ఆరంభం

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 73,035 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,090 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 15 గంటల సమయం పట్టింది.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై తొలి రోజున శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఇచ్చారు. భక్తులను కటాక్షించారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు ఉత్సవ మూర్తులు వేంచేపు చేశారు.

Annual Salakatla Teppotsavams at Tirumala commenced on Thursday evening in a grand manner by TTD

అనంతరం పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే అయిదు రోజుల తెప్పోత్సవాలను "తెప్ప తిరునాళ్లు"గా పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీవారు స్వామి పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.

ప్రతి సంవత్సరం ఫాల్గుణ / చైత్ర మాసాల్లో (ఫిబ్రవరి-మార్చి) ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. సాళువ నరసింహరాయలు 1,468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య పుష్కరిణి పునరుద్ధరణ చేపట్టి, స్వామి పుష్కరిణి- వరాహ పుష్కరిణిలను వేరు చేసినట్లు శాసనాల్లో ఉంది. మధ్యలో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ 1,921లో తిరిగి ఈ ఉత్సవాలు పునరుద్ధరించారు. 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+