జగన్‌కు ఝలక్: కల్పన దారిలో.. టిడిపిలోకి మరో 7గురు ఎమ్మెల్యేలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరిన్ని వలసలు తెలుగుదేశం పార్టీలోకి కొనసాగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరిన్ని వలసలు తెలుగుదేశం పార్టీలోకి కొనసాగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత, కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు.
ఆయన శనివారం నాడు విలేకరులతో మాట్లాడారు. త్వరలో వైసిపి నుంచి మరో ఏడుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతారని చెప్పారు. దళిత వ్యతిరేక విధానాల వల్లనే వైసిపిని ఒక్కో దళిత ఎమ్మెల్యే వీడుతున్నారని చెప్పారు. ఉప్పులేటి కల్పన దారిలో మరింతమంది నడుస్తారన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి దాకా ఇరవై మందికి పైగా వైసిపి నుంచి టిడిపిలో చేరారని చెప్పారు. మరో ఏడుగురు త్వరలో వచ్చే అవకాశముందని వ్యాఖ్యానించారు. దళిత ఎమ్మెల్యేలకు వైసిపిలో సరైన గౌరవం దక్కడం లేదన్నారు. ఇది వారు రావడానికి మొదటి కారణం అన్నారు.
నాయకత్వం దళితులను చిన్న చూపు చూస్తే ఏమీ గత్యంతరం లేక ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఆ బంధాలను తెంచుకొని బయటకు వచ్చి అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల కోసం రావాల్సి ఉందన్నారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత వారు వస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications