మేయర్ హత్యలో మరో అరెస్ట్: చింటూ డ్రైవర్ అరెస్ట్, రివాల్వర్ స్వాధీనం
చిత్తూరు: మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో నిందితుల సంఖ్య 20కి చేరింది. హత్యలో ప్రధాన నిందితుడు చింటూకు ముఖ్య అనుచరుడు, డ్రైవర్ వెంకటేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు.
మేయర్ దంపతుల హత్య కేసులో డ్రైవర్ వెంకటేష్ ఐదో ముద్దాయిగా ఉన్నాడని చెప్పారు. నిందితుడి నుంచి రివాల్వర్, తల్వార్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడుని రిమాండుకు తరలించనున్నట్లు ఆయన చెప్పారు.
మేయర్ దంపతుల హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. హత్య అనంతరం ఘటనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న ముగ్గురు లొంగిపోయారు. కొద్ది రోజుల క్రితం ప్రధాన నిందితుడు, కటారి మోహన్ మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు.

మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంగా పదిహేను మంది చింటూ స్నేహితులు, రాజకీయ నేపథ్యమున్నవారు కూడా అరెస్టయ్యారు. తాజాగా, శుక్రవారం ఉదయం చింటూ కారు డ్రైవర్‌గా పని చేసిన వెంకటేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య ఇరవైకి చేరింది.
మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో రెండు రోజుల క్రితమే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హత్య కుట్ర ముందుగానే తెలిసి, సలహాలు ఇచ్చారనే కారణంతో ఒకరిని, హతుడికి ఆశ్రయం కల్పించారని మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
హత్య కుట్ర ముందుగా తెలిసి, సలహాలు ఇచ్చినందుకు చిత్తూరు నగరానికి చెందిన లాయర్ యోగానంద్‌ను, నిందితుడికి ఆశ్రయం కల్పించి, సహాయం చేశాడని చెబుతూ శ్రీకాళహస్తికి చెందిన రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications