ఛేజింగ్, హైడ్రామా: ఇద్దరు దోపిడీ దొంగల హతం, కానిస్టేబుల్ మృతి

నల్లగొండ:శనివారం ఉదయం నుంచి నల్లగొండ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నల్లగొండ జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మరోసారి కాల్పులు జరిపి బైక్‌పై పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు దోపిడీ దొంగలను పోలీసులు వెంటాడారు. చివరకు వారిని కాల్పులు హతం చేశారు. ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మరణించాడు. ఈ ఘటనలో సిఐలు బాలగంగిరెడ్డి, గంగారాం, ఎస్సై సిద్ధయ్య గాయపడ్డారు. గాయపడిన ఎస్సై పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద పోలీసులు ఇద్దరు దోపిడీ దొంగలను చంపేశారు.

పోలీసుల కాల్పుల్లో మరణించిన ఇద్దరిని సూర్యాపేట కాల్పులకు పాల్పడినవారేేనని నిర్ధారించారు. శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం సూర్యాపేట ఘటన జరిగిన స్థలానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. సంఘటనా స్థలానికి తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ పరిశీలిస్తున్నారు.

నల్లొండ జిల్లా అరవపల్లి కొండల్లో తలదాచుకున్నట్లు అనుమానించిన పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ బైక్‌ను దొంగలించి ఇద్దరు దోపిడీ దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే, మధ్యలో పెట్రోల్ అయిపోవడంతో బైక్‌ను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారు. స్థానికుల సహకారంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ స్థితిలో దోపిడీ దొంగలకు, పోలీసులకు మధ్య జానకీపురం వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పోలీసులు ఇద్దరు దోపిడీ దొంగలను కాల్చి చంపేశారు. గత మూడు రోజులుగా పోలీసులు సూర్యాపేట కాల్పుల ఘటన నిందితుల కోసం గాలిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం సీతారాంపురం దగ్గర కాల్పులు జరిగాయి. పోలీసులపై సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులు కాల్పులు జరిపారు. పోలీసుల నుంచి అపహరించిన కార్బన్ వెపన్‌తో నిందితులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.

గన్‌తో బెదిరించి ఓ వ్యక్తి దగ్గర బైక్ లాక్కొని వరంగల్ జిల్లా జనగాం వైపు నిందితులు పారిపోయినట్లు సమాచారం. డిస్కవర్ బైక్ నెంబర్ ఏపీ 24 7066గా పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులన వెంబడిస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాలతో పాటు ప్రత్యేక కమాండోలు రంగంలోకి దిగారు.

Firing

జనగామ బార్డర్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. ప్రత్యేక బలగాలతో ఎస్పీ అంబర్‌కిశోర్‌జా గాలింపు చేపట్టారు. దుండగులు అరవపల్లి మండలం సీతారాంపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సిఐ గంగారాంపైకి కాల్పులు జరిపి పారిపోయారు.

తాము ప్రయాణిస్తున్న బైక్‌ను దుండగులు మోత్కూరు మండలం చిన్నకొండూరు గ్రామం వద్ద వదిలిపెట్టి పారిపోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు పెద్ద యెత్తున మోహరించారు.

కాగా, బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించగా, సిఐతో పాటు మరో హోంగార్డు గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+