వరుస మరణాలు: తాజాగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురి శవాలు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వరుసగా మృతదేహాలు బయటపడడం కలవరాన్ని కలిగిస్తోంది. మళ్లీ నాలుగు మృతదేహాలు వెలుగు చూశాయి. నర్రవాడ శివార్లలోని కుళ్లిన స్థితిలో నాలుగు మృతదేహాలు లభించాయి. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

వారంరోజుల క్రితం నర్రవాడ శివార్లలో కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు. వ్యాపారం దెబ్బ తినడంతో అప్పులు చేయిదాటిపోవడంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన కూతురు వద్మ, మరో ఇద్దరికి విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

బుధవారంనాడు ముగ్గురు అనునాస్పద స్థితిలో మరణించడం బుధవారంనాడు కలకలం రేపిన విషయం తెలిసిందే. ముగ్గురిని దారుణంగా హత్య చేసిన దుండగులు వారిని గుర్తుపట్టకుండా తగులబెట్టేశారు. బుధవారం ఉదయం నాయుడుపేటలోని శివారులోని కాళహస్తిరోడ్డులో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసి తగుబెట్టారు. అతడి వయసు దాదాపు 30 ఏళ్ల ఉంటుందని గుర్తించారు. ఇతను ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.

Another four dead bodies found in Nellore district

నెల్లూరు జిల్లాలోని గూడూరులో మరో హత్య వెలుగులోకి వచ్చింది. శివారులోని అటవీ ప్రాంతంలో వినాయకుడి ఆలయం వద్ద మరో శవాన్ని గుర్తించారు. అదే విధంగా కొడవలూరు మండలం రేగడిచిలక ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. ఆటోతో సహా మృతదేహాన్ని దుండగులు తగులబెట్టారు. ఆటో సాయి కుమార్ అనే పేరు మీద రిజిష్టర్ అయి ఉంది.

ఈ మూడు ఘటనలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తమిళనాడుకు చెందిన కిరాయి హంతుకులు హత్య చేసి ఉంటారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు హత్యలపై అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హత్యలకు గురైన వారు ఎవరనే దానిపై పూర్తి స్థాయిలో విచారణను మొదలు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+