బాలగోపాల్ మృతదేహాన్ని స్వస్థలం చేరుస్తాం: తానా

విజయవాడ: అమెరికాలో దారుణ హత్యకు గురైన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం చిట్టూర్పుకు చెందిన పరుచూరి బాలగోపాల్ మృతదేహాన్ని త్వరలో స్వస్థలం చేరుస్తామని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఆయన తెలిపారు.

గ్యాస్ స్టేషన్ యజమాని శ్రీధర్ కమ్మ సహకారంతో త్వరలోనే అతడి మృతదేహాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. సౌత్ కరోలినాలోని మైథేల్ బీచ్ గ్యాస్ స్టేషన్ లో దొంగతనానికి వచ్చిన కొంతమంది నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో బాలగోపాల్ మరణించిన సంగతి తెలిసిందే.

Another Indian From Andhra Shot Dead in US

మృతుడు చల్లపల్లి మండలం చిట్టూర్పుకు చెందిన బాలగోపాల్‌ అమెరికాలోనిలోని సౌత్ కరోలినా రాష్ట్రంలోని మైథేల్ బీచ్‌లో గ్యాస్‌స్టేషన్‌ నడుపుతున్నాడు. దొంగతనం కోసం గ్యాస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన నల్లజాతీయుడు బాలగోపాల్‌ను కాల్చి చంపాడు. బాలగోపాల్ స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+