టిడిపికి మ‌రో ఎంపి గుడ్ బై : వైసిపి లోకి పండుల : పాయ‌క‌రావు పేట మ్మెల్యేగా పోటీ..!

టిడిపికి మ‌రో ఎంపి గుడ్ బై చెప్పారు. నాలుగు రోజుల క్రితం అన‌కాప‌ల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి వైసిపి లో చేర‌గా..తాజాగా మ‌రో ఎంపి రాజీనామా చేసారు. అమ‌లా పురం ఎంపి పండుల ర‌వీంద్ర‌బాబు వైసిపి లో చేరుతున్నా ర‌నే ప్ర‌చారం వారం రోజులుగా సాగుతోంది. అయితే, ఆయ‌న ఆ ప్ర‌చారాన్ని ఖండించారు. తిరిగి ఈ రోజు వైసిపి లో చేర‌టం కోసం జ‌గన్ తో స‌మావేశం అవుతున్నారు.

వైసిపి లోకి రవీంద్ర‌బాబు

వైసిపి లోకి రవీంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీకి అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు గుడ్‌ బై చెప్పారు. సోమవారం ఆయన వైసీపీ అధ్యక్షు డు జగన్‌ను కలవనున్నారు. అమలాపురం టీడీపీ ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు... అధిష్టానం ఆసక్తి చూపకపోవడంతో రవీంద్రబాబు అసంతృప్తి చెంది.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో రవీంద్రబాబు ఎక్కడో ఓ చోట...ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకుంటున్నట్లుగా సమాచారం. వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఎంపీ పి.రవీంద్రబాబు ఖండించిన విషయం తెలిసిందే. తాను టీడీపీని వీడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచు కుంటానని వ్యాఖ్యానించారు. కాగా, ఆయ‌న త‌న మ‌న‌సు మార్చుకొని తిరిగి వైసిపి వైపే అడుగలు వేస్తున్నారు.

ర‌వీంద్రబాబు పోటీ అక్క‌డి నుండేనా..

ర‌వీంద్రబాబు పోటీ అక్క‌డి నుండేనా..

2014 ఎన్నిక‌ల్లో టిడిపి నుండి గెలిచిన రవీంద్ర‌బాబు ప్ర‌స్తుతం టిడిపి లో ప్రాధాన్య‌త ల‌భించ‌టం లేద‌నే భావ‌న లో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు పైనా హామీ ల‌భించ‌టం లేదు. టిడిపి నుండి ఈ సారి అమలాపురం లోక్ స‌భ అభ్య‌ర్ది రిటైర్డ్ న్యాయ‌మూర్తి బాల‌యోగి కుమారుడు పోటీ చేసే అవ‌కాశం ఉంది. దీంతో..వైసిపి లో చేరాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. 2014 లో ర‌వీంద్ర‌బాబు వైసిపి అభ్య‌ర్ది పి విశ్వ‌రూప్ పై గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో ర‌వీంద్ర బాబుకు 594547 ఓట్లు రాగా, వైసిపి అభ్య‌ర్దికి 473971 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది ర‌వీంద్ర‌బాబు 120576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ర‌వీంద్రబాబు వైసిపి లో చేరితే ఎంపీగా అవ‌కాశం ఇస్తారా..ఎమ్మెల్యే గా పోటీ చేయిస్తారా అనేది జ‌గ‌న్ తో స‌మావేవ‌మైన స‌మ‌యంలోనే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

అమ‌లాపురం ఎంపీగా అవ‌కాశం ఇస్తే

అమ‌లాపురం ఎంపీగా అవ‌కాశం ఇస్తే

ర‌వీంద్ర కు వైసిపి నుండి అమ‌లాపురం ఎంపీగా అవ‌కాశం ఇస్తే..విశ్వ‌రూప్ ను అమ‌లాపురం ఎమ్మెల్యేగా బ‌రిలో దించే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు సమాచారం. విశ్వ‌రూప్ గ‌తంలో రెండు సార్లు అమ‌లాపురం నుండి గెలిచిన మంత్రిగా ప‌ని చేసారు. అయితే, వైసిపి లో చేరుతున్న పి ర‌వీంద్ర‌బాబును విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా జ‌గ‌న ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+