టిడిపికి మ‌రో ఎంపి గుడ్ బై..! : వైసిపి లో చేరేందుకు సిద్దం : సీటు పైనే పీట ముడి..!

ఏపిలో అధికారిక తెలుగుదేశం పార్టీకి మ‌రో ఎంపి గుడ్ బై చెప్పేందుకు సిద్ద‌మ‌య్యారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన టెలి కాన్ఫిరెన్స్ కు ఇద్ద‌రు ఎంపీలు దూరంగా ఉన్నారు. వారిలో ఒక‌రైన అన‌కాప‌ల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ వైసిపి అధినేత జ‌గ‌న్ ను క‌లుస్తున్నారు. ఆయ‌న ఇప్ప‌టికే విజ‌య‌సాయి రెడ్డితో భేటీ అయ్యారు. ఇక‌, మ‌రో ఎంపి సైతం వైసిపి నేత‌ల‌తో ట‌చ్ లోకి వ‌చ్చారు. ఆయ‌న కు వైసిపి ఎక్క‌డి నుండి పోటీకి అవ‌కాశం ఇస్తుంద‌నే దాని పైనే చ‌ర్చ‌లు సాగుతున్నాయి. దీని పై స్ప‌ష్ట‌త వ‌స్తే రేపో మాపో ఆయ‌న వైసిపి లోకి రావ‌టం ఖాయం..

టిడిపికి మ‌రో ఎంపి గుడ్‌ బై..!
ఏపిలోని అధికార పార్టీ టిడిపి కి మ‌రో ఎంపీ రాజీనామా చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగియ టంతో వారు పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్ప‌టికే అన‌కాప‌ల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ టిడిపికి రాజీనామా చేసారు. ఆయ‌న ఈ రోజు సాయంత్రం వైసిపి లో చేరుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు వైసిపి లో ల భించే ప్రాధాన్య‌త పై వైసిపి నేత విజ‌య సాయిరెడ్డితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

Another MP ready to quit TDP : He joining in YCP..!

ఇక‌, టిడిపి నుండి 2014 లో అమ‌లా పురం నుండి గెలిచిన రిటైర్డ్ ఐఆర్‌య‌స్ అధికారి పండు ర‌వీంద్రబాబు టిడిపి వీడేందుకు సిద్ద‌మ‌య్యారు. ఆయ‌న వైసిపి లో చేరేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే వైసిపి లోని ప్ర‌ముఖ‌ల‌తో ఆయ‌న ట‌చ్ లో ఉన్నారు. అయితే, ఆయ‌న‌కు పోటీ చేసే సీటు పై ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. రేపో మాపో ఆయ‌న వైసిపి అధినేత జ‌గ‌న్ ను క‌ల వనున్న‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం.

ర‌వీంద్రబాబు వైసిపి లోకి వ‌స్తే..
2014 ఎన్నిక‌ల్లో టిడిపి నుండి గెలిచిన రవీంద్ర‌బాబు ప్ర‌స్తుతం టిడిపి లో ప్రాధాన్య‌త ల‌భించ‌టం లేద‌నే భావ‌న లో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు పైనా హామీ ల‌భించ‌టం లేదు. దీంతో..వైసిపి లో చేరాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. 2014 లో ర‌వీంద్ర‌బాబు వైసిపి అభ్య‌ర్ది పి విశ్వ‌రూప్ పై గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో ర‌వీంద్ర బాబుకు 594547 ఓట్లు రాగా, వైసిపి అభ్య‌ర్దికి 473971 ఓట్లు వ‌చ్చాయి.

టిడిపి అభ్య‌ర్ది ర‌వీంద్ర‌బాబు 120576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ర‌వీంద్రబాబు వైసిపి లో చేరితే ఎంపీగా అవ‌కాశం ఇస్తారా..ఎమ్మెల్యే గా పోటీ చేయిస్తారా అనేది జ‌గ‌న్ తో స‌మావేవ‌మైన స‌మ‌యంలోనే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ర‌వీంద్ర కు వైసిపి నుండి అమ‌లాపురం ఎంపీగా అవ‌కాశం ఇస్తే..విశ్వ‌రూప్ ను అమ‌లాపురం ఎమ్మెల్యేగా బ‌రిలో దించే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు సమాచారం. విశ్వ‌రూప్ గ‌తంలో రెండు సార్లు అమ‌లాపురం నుండి గెలిచిన మంత్రిగా ప‌ని చేసారు. ర‌వీంద్ర‌బాబు వైసిపి లో చేరిక పై రేపో మాపో అధికారికంగా నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+