గుంటూరులో మరో దారుణం: మైనర్ బాలికపై యువకుడి రేప్ యత్నం..
గుంటూరు: గుంటూరులో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడిని రాజాసింగ్ గా గుర్తించారు. విషయం తెలిసిన స్థానికులు అతన్ని ఉరితీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసం ఉండే రాజాసింగ్ అనే యువకుడు స్థానిక బేకరీలో పనిచేస్తున్నాడు. మంగళవారం బేకరీలో పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఓ పదేళ్ల చిన్నారిని తనతో పాటు ఇంట్లోకి తీసుకెళ్లాడు.
ఇంట్లో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడటంతో ఆ చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో గమనించిన స్థానికులు రాజాసింగ్‌ని పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడుని వెంటనే ఉరి తీయాలంటూ బాలిక బంధువులు పెద్ద ఎత్తున పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications