Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రఘురామ మరో ట్విస్ట్‌- అప్పుడే డిశ్చార్జ్‌ వద్దు-ఆస్పత్రి బయట ఏపీ పోలీసులు-కమాండర్‌కు లేఖ

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ బెయిల్ కోసం తీవ్రప్రయత్నాలు చేసి చివరకు సుప్రీంకోర్టులో దాన్ని సాధించుకున్న రఘురామరాజు ఇప్పుడు బెయిల్‌ ఇస్తామన్నా సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటానని మొండికేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా నాలుగైదురోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ఆర్మీ డాక్టర్లు చెప్తున్నా.. తాను పూర్తిగా కోలుకునేవరకూ వెళ్ళేది లేదంటున్నారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు రఘురామ లేఖ

ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు రఘురామ లేఖ

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలతో రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఐడీ అరెస్టు తర్వాత తనకు వైద్య పరీక్షలు జరిపించాలని కోరారు. ఏపీలో ఓసారి వైద్య పరీక్షలు నిర్వహించాక తిరిగి సుప్రీంకోర్టులో పోరాడి మరీ సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్నారు. అందులో కాలికి గాయం ఉందని తేలడంతో అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు బెయిల్‌ నేపథ్యంలో ఆయన ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లి చికిత్స తీసుకోవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటానంటూ తాజాగా ఆర్మీ కమాండర్‌కు లేఖ రాశారు.

 రఘురామ హెల్త్‌ బులిటెన్‌

రఘురామ హెల్త్‌ బులిటెన్‌

ఆర్మీ కమాండర్‌కు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు తన ఆరోగ్య పరిస్ధితిని ఆయనకు వివరించారు. తాను ప్రస్తుతం పెయిన్ కిల్లర్స్‌, యాంటీ బయోటిక్స్‌ వాడుతున్నానని, కాలి నొప్పి ఇంకా తగ్గలేదని తెలిపారు. బీపీలోనూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయన్నారు. నోరు కూడా తడారి పోతుందన్నారు. రెండు, మూడు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలన్నారు. దీంతో ఆర్మీ ఆస్పత్రిలో తనకు ఏం కావాలో కమాండర్‌ దృష్టికి రఘురామ తీసుకెళ్లినట్లయింది.

అయినా డిశ్చార్జ్‌ చేస్తానంటే

అయినా డిశ్చార్జ్‌ చేస్తానంటే

సుప్రీంకోర్టు బెయిల్‌ నేపథ్యంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికెళ్లే అవకాశం ఉన్నా తన ఆరోగ్య పరిస్ధితిపై ఆర్మీ కమాండర్‌కు రఘురామ రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. తాను కోలుకునే వరకూ ఆస్పత్రిలోనే ఉంటానని ఆయన చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ లేఖలోనే తాను కోలుకోకుండానే డిశ్చార్జ్‌ చేయాలనుకుంటే డిశ్చార్జ్‌ సమ్మరీలో నా ఆరోగ్య పరిస్ధితిని స్పష్టంగా తెలియజేయాలని ఆర్మీ కమాండర్‌ను కోరారు. అంటే రఘురామ కోలుకోకుండానే తాను డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు ఆర్మీ ఆస్పత్రి రిపోర్ట్‌ ఇవ్వాలన్నమాట.

ఆస్పత్రి బయట ఏపీ పోలీసులు

ఆస్పత్రి బయట ఏపీ పోలీసులు

ఆర్మీ కమాండర్‌కు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి బయట ఏపీ పోలీసులు ఉన్నట్లు ఆర్మీ కమాండర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దమన్నారు. ఇప్పటికే తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే గుంటూరు తీసుకెళ్లే్ందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి లీగల్‌ నోటీసులు పంపిన రఘురామ..ఇప్పుడు ఆస్పత్రి బయట ఏపీ పోలీసులు ఉన్నారంటూ ఆర్మీ కమాండర్‌ దృష్టికి తీసుకెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+