పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు షాక్.. జనసేనకు మరో రెండు సీట్లు తగ్గింపు..?
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే జనసేన , బీజేపీలతో పొత్తు పెట్టుకున్న ఆయన.. వైసీపీ ఓటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పొత్తులో భాగంగా కీలక స్థానాలను వదులుకోవడానికి సైతం చంద్రబాబు సిద్ధపడ్డారు. రాబోవు ఎన్నికలు చంద్రబాబుకు చాలా కీలకం కావడంతో ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన వెంటనే.. నియోజకవర్గ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిఠాపురం టీడీపీ నేత వర్మ వర్గీయులు పవన్ కల్యాణ్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకనొక సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన చంద్రబాబు వర్మను పిలిపించి ఆయనతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ గెలుపుకు సహకరించాలని..కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వర్మ వెనక్కి తగ్గారు.

ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనలకు కేటాయించిన స్థానాలపై టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బీజేపీకు 10 స్థానాలు, జనసేన 21 స్థానాలకు కేటాయించారు. అయితే టీడీపీ బలంగా ఉన్న చోట్ల కూడా జనసేన అభ్యర్థులు టికెట్ కోసం పట్టుపట్టడంపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పక్కా గెలిచే స్థానాలను బీజేపీ , జనసేనకు కేటాయించడం వల్ల వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లగా..దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని నాయకులకు చంద్రబాబు సర్ధిచెప్పారట.
తాజాగా దీనిపై బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం అందుతోంది. బీజేపీ, జనసేనలకు చేరో లోక్‌సభ స్థానాన్ని అదనంగా కేటాయించి.. మరో నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయలనే ప్రతిపాదనను చంద్రబాబు బీజేపీ నేతల ముందు వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీకి అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంట్ స్థానాలు కీలకం కావడంతో .. చంద్రబాబు చేసిన ప్రతిపాదనపై ఆలోచించే అవకాశం ఉంది.
ఇక బీజేపీ తమ అసెంబ్లీ స్థానాలను తగ్గించుకుంటే పవన్ కల్యాణ్ సైతం రెండు స్థానాలను తగ్గించుకోవడం ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనికి బదులు జనసేనకు మరో పార్లమెంట్ సీటును అదనంగా కేటాయిస్తారు కాబట్టి..ఆ పార్టీలో దీనివల్ల ఎటువంటి సమస్య తలెత్తే అవకాశం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఎవర్ని ఎక్కడ నుంచి బరిలోకి దింపాలని రాష్ట్ర బీజేపీ నేతలతో అగ్ర నాయకత్వం చర్చించే అవకాశం ఉంది. బీజేపీ నేతలు ఢిల్లీ టూర్ తరువాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications