బాబుపై అలిపిరి దాడిలో హస్తం: ఎన్‌కౌంటర్‌లో గణేష్ మృతి, ఆర్కే ఎస్కేప్

మల్కాన్‌గిరి/విశాఖ: సోమవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు మల్కాన్‌గిరిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు అగ్రనేతలు కూడా మృతి చెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేతలైన డాకూరి వెంకటరమణ అలియాస్ గణేష్, గాజర్ల రవి అలియాస్ గణేష్, ఉదయ్ లు కూడా ఉన్నారు.

వెంకటరమణ స్వస్థలం విశాఖపట్నం జిల్లా కాగా, రవి స్వస్థలం జయశంకర్ జిల్లా. గతంలో శాంతి చర్చల ప్రతినిధిగా రవి పాల్గొన్నారు. 2004లో మావో అగ్రనేత ఆర్కేతోపాటు రవి పాల్గొన్నారు.

ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్: 21మంది మావోలు మృతి, కీలక నేతలు కూడా!

అంతేగాక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అలిపిరిలో జరిగిన దాడిలో గణేష్ హస్తం ఉండటం గమనార్హం. కాగా, గణేష్ ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు తీవ్రమైన కృషి చేస్తున్నారు. మావోయిస్టు పార్టీని బలోపేతం చేసి, ఆంధ్రాలోకి చొచ్చుకొచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నన్నట్లు తెలిసింది.

Maoist leader Ganesh killed in AOB encounter.

ఇప్పటికే ఏపీలో తమ ఉనికిని చాటేందుకు ముమ్మర కసరత్తులు చేశారాయన. కాగా, వెంకటరమణపై రూ. 20లక్షలు, రవిపై రూ. 25లక్షల రివార్డు ప్రకటించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆర్కే కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, ఆయన తప్పించుకున్నారు.

ఆర్కే కుమారుడు మృతి

ఇటీవల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందడం ఇదే తొలిసారి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్నాకూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మున్నా ఇటీవలే మావోయిస్టు దళంలో చేరినట్లు తెలుస్తోంది. కాగా, ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఏవోబీలో మళ్లీ కాల్పులు

ఏవోబీలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులకు తీవ్రగాయాలు కావడంతో వారిని విశాఖలోని ఆస్పత్రికి తరలించారు.

ఇది ఎన్‌కౌంటారా?: వరవరరావు

మావోల సమావేశంపై దాడి చేసి ఎన్‌కౌంటర్ అంటారా? అంటూ వరవరావు మండిపడ్డారు. విభజన తర్వాత మావోలు ఎక్కడైనా దాడి చేశారా? అని ప్రశ్నించారు. ప్రకృతి సంపదను బడా బాబులకు కట్టపెట్టేందుకే ఎన్‌కౌంటర్ అని ధ్వజమెత్తారు.

బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, హత్యా నేరం నమోదు చేయాలని వరవరావు అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కాగా, ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు, శాంతి చర్చల ప్రతినిధి రవికి జోహార్లు అంటూ ప్రజా గాయకుడు గద్దర్ నినదించారు. ఎన్ కౌంటర్ ను న్యూడెమోక్రసీ, వరవరరావు, హరగోపాల్ ఖండించారు. బంధువుల ముందే మృతుల పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో వ్యాజ్యం

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్‌కౌంటర్‌పై తమకు అనుమానాలున్నాయని... దీనిపై విచారణ జరపాలని కోరడంతో హైకోర్టును ఆశ్రయించింది. వ్యాజ్యాన్ని స్వీకరించిన హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు దీనిపై విచారణ చేపట్టనుంది.

ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌ మృతి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయాడు. మావోయిస్టుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు సీనియర్‌ కమాండోలను హెలికాప్టర్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన అబూబాకర్‌ అనే సీనియర్‌ కమాండో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+