అమరావతి:ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల కోసం...ఇంటీరియర్ డిజైన్ల కొలువు
అమరావతి:రాజధాని నగరంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎపి గవర్నమెంట్ నిర్మిస్తున్న హౌసింగ్ ప్రాజెక్టులకు అనువైన ఇంటీరియర్ డిజైన్లను సిఆర్డీఏ ఉన్నతాధికారులు పరిశీలించారు.
రాజధాని నగరం పరిధిలోకి వచ్చే రాయపూడి, నేలపాడుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్, గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న ప్రభుత్వం హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి అనువైన ఇంటీరియర్ డిజైన్లను విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఆర్కాప్ అనే సంస్థ ప్రతినిధులు గురువారం ఈ డిజైన్లను కొలువు తీర్చారు.

గవర్నమెంట్...హౌసింగ్ ప్రాజెక్టు
ఉన్నతాధికారులకు, ఎన్‌జిఒలకు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం ప్రభుత్వం మొత్తం 61 టవర్లలో 3840 నివాస గృహాలను సిద్దం చేస్తున్నారు. ఈ నిర్మాణాలను సరికొత్త షీర్‌వాల్ టెక్నాలజీతో చేపడుతున్నారు. ఎమ్మెల్యేల కోసం 12 టవర్లలో 288 ఇళ్లు, ఉన్నతాధికారుల కోసం 6 టవర్లలో 144 ఇళ్లు, ఎన్‌జిఒల కోసం 22 టవర్లలో 1968 ఇళ్లు, అధికారుల కోసం 15 టవర్లలో 720 ఇళ్లు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం 6 టవర్లలో 720 ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు.

ఇంటీరియర్ డిజైన్ల...కొలువు
మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునికమైన ఇంటీరియర్ సామాగ్రిని, వివిధ రకాల మెటీరియల్స్ ను కూడా అందుబాటులో ఉంచడంతో పాటు వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ కాంప్లెక్స్‌లోని టవర్లలో ఉండే హాళ్లు, సిట్టింగ్ ఏరియా, పడక గదులు, బాల్కనీ, మెట్ల రెయిలింగ్‌లు, కారిడార్లు, లిఫ్ట్ క్లాడింగ్‌ల కోసం రూపొందించిన డిజైన్ల గురించి తెలియజేశారు. కిచెన్ ప్లాట్‌ఫాం, కప్ బోర్డులు, బాత్‌రూం ఫిట్టింగ్స్, టైల్స్, వాల్ ఫినిషింగ్, ఫాల్స్‌సీలింగ్ మోడళ్లను ప్రదర్శించారు.

అధికారులకు...వివరణ
వీటితోపాటు ఆయా హౌసింగ్ ప్రాజెక్టుల్లోని క్లబ్ హౌస్‌ల మోడళ్లను కూడా చూపారు. వీటిల్లో ఏర్పాటు చేసే స్విమ్మింగ్‌పూల్, అవుట్‌డోర్, ఇండోర్ గేమ్స్ తదతర వసతుల గురించి నిపుణులు అధికారులకు వివరించారు. వీటిని పరిశీలించిన సీఆర్డీయే కమిషనర్ డాక్టర్ శ్రీధర్, అడిషనల్ కమిషనర్ షణ్మోహన్ డిజైన్లపై కొంత అసంతృప్తిలోనైనట్లు తెలుస్తోంది.

అసంతృప్తి...మరోసారి
దీంతో ఈ ఇంటీరియర్ డిజైన్లను మరింత ఆకర్షణీయంగా మలచాల్సిందిగా ఆర్కాప్ ప్రతినిధులకు వీరు సూచించారు. దీంతో సిఆర్డీఏ అధికారులను ఆకట్టుకోవడం కోసం మరోసారి ఈ డిజైన్ల కొలువు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications