పట్టిసీమ పూర్తయి రెండేళ్లవుతుంటే...ఇప్పుడా విమర్శలు:ఎమ్మెల్యే నరేంద్ర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తయిన రెండేళ్ల తరువాత ఆ ప్రాజెక్టుపై విష్ణుకుమార్ రాజు ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు.
పట్టిసీమ ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించి నిర్మించడం జరిగిందన్నారు. డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందనే ఆందోళనతో...ముందుచూపుతో సిఎం చంద్రబాబు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా తీసుకువచ్చారని ఎమ్మెల్యే నరేంద్ర వివరించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ డెల్టాకు ప్రాణాధారం లాంటిదన్నారు.

పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి డెల్టా ప్రాంతానికి ఇప్పటివరకు 115 టీఎంసీల నీరు అందించామని ధూళిపాళ్ల నరేంద్ర వెల్లడించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల డెల్టాలో రైతులు పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్న ఈ తరుణంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, ఇది ఎంతో బాధాకరమని నరేంద్ర చెప్పారు.












Click it and Unblock the Notifications