వరద బాధితులకు అండగా నిలవాలంటే - విరాళాలు ఇలా..!!

తెలుగు రాష్ట్రాలను వరద ముంచెత్తింది. పలు ప్రాంతాల ప్రజలను కోలుకోలేని దెబ్బ తీసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు బాసటగా నిలిచాయి. ప్రభుత్వం ఏంత చేసినా ఏ మాత్రం సరిపోని విధంగా బాధితులు నష్టపోయారు. వీరి కోసం అండగా నిలిచి సహాయం చేయాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. ఇందు కోసం హెల్ప్ లైన్ తో పాటుగా బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.

సాయం కోసం
వరద బాధితులకు సహాయం చేయాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. దాతలకు సమాచారం అందించేందుకు హెల్ప్​ లైన్​ నెంబరు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా కూడా సహాయం చేయవచ్చని అధికారులు తెలిపారు. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రత్యేక పాయింట్‌ ఏర్పాటు చేశారు.

AP and TG Govt Reveals Accounts details for Donors to make donations for Flood Relief measures

ముందుకొస్తున్న దాతలు
ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్‌కు అప్పగించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబరు ఏర్పాటు చేశారు. ధన సహాయం చేసే దాతలు ఆన్‌లైన్‌ చెల్లింపు ద్వారా ఈ క్రింద పేర్కొన్న బ్యాంక్ ఖాతాలకు జమ చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రకటించింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించారు. టాలీవుడ్ ముందుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఏపీ ఎన్జీఏ సంఘం రూ 120 కోట్లు ప్రకటించారు.

విరాళాల వెల్లువ
ఇప్పటి వరకు నారా భువనేశ్వరి రెండు రాష్ట్రాలకు రెండు కోట్లు, జగన్ కోటి రూపాయలు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ కోటి రూపాయాలు ఇవ్వగా సినీ ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్: ఏపీకి రూ. 5 కోట్లు, తెలంగాణకు రూ. కోటి, ప్ర‌భాస్: ఏపీకి రూ. కోటి, తెలంగాణకు రూ. కోటి, చిరంజీవి: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు, బాలకృష్ణ: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు, మహేష్ బాబు: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు ,రామ్ చరణ్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు, ఎన్టీఆర్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు, అల్లు అర్జున్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు, అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు, త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు ఇచ్చారు.

వీరితో పాటుగా పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు తమ విరాళాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ, ఏపీ ఉద్యోగులు సైతం తమ వంతు సాయం ప్రకటించారు. ఇక, ఏపీకి సాయం అందించే వారి కోసం ప్రభుత్వం బ్యాంకు వివరాలను వెల్లడించింది. బ్యాంక్ ఖాతాల వివరాలు:

State Bank Of India:
A/c Name : CMRF
A/c Number : 38588079208
Branch: AP Secretariat
IFSC code : SBIN0018884

Union Bank of India:
A/c name : CM Relief Fund
A/c number : 110310100029039
Branch: AP Secretariat, Velagapudi.
IFSC code : UBIN0830798.

Help line for Donors
79067 96105.

తెలంగాణ ప్రభుత్వానికి వరద బాధితుల సహాయార్ధం విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ బ్యాంకు ఖాతాకు పంపగలరు..
Donate to CM Relief Fund by Online Transfer
Account Number : 62354157651
Account Name : CM RELIEF FUND
Bank Name : State Bank of India
Branch : Secretariat, Hyderabad, Telangana
IFSC Code : SBIN0020077.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+