PMAY: పేదల ఇళ్లకు ముగుస్తున్న డెడ్ లైన్..! రఘురామ కీలక సూచన..!

ఏపీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో సొంత స్థలాలు లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఉన్న పేదలు వీటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో పీఎంఏవై రూరల్ పథకం కోసం ఇచ్చిన గడువును ప్రభుత్వం పొడిగించింది కూడా. ఆ గడువు కూడా త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కమ్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు లబ్దిదారులకు కీలక విజ్ఞప్తి చేశారు.

ప్రజలందరికీ నా విజ్ఞప్తి అంటూ ఇవాళ ఎక్స్ లో రఘురామ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన సొంత స్థలములో లేదా ప్రభుత్వం నుండి పొందిన పట్టా స్థలములో ఇల్లు నిర్మించుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులకు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా "ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)" పథకం ద్వారా రూ.2,50,000/- ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని రఘురామ తెలిపారు.

ap assembly deputy speaker raghurama Krishnam raju request to eligible PMAY beneficiaries

కాబట్టి అర్హులైన వారు తమ వివరాలను గ్రామ/మున్సిపల్ వార్డు సచివాలయములలో మీ వివరాలు నమోదు చేసుకోవలసిందిగా నా మనవి అంటూ రఘురామ కోరారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు
సంకల్పానికి మన వంతుగా నవంబర్ 30 వ తేదీ లోపు మీ వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నట్లు రఘురామ వెల్లడించారు. అయితే ఇప్పటికే రాష్టవ్యాప్తంగా లక్షల సంఖ్యలో లబ్దిదారులు పీఎంఏవై ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చేసుకోవాల్సిన వారి కోసం రఘురామ ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. 2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్న సీఎం చంద్రబాబు టార్గెట్ లో భాగంగా రఘురామ ఈ విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+