చంద్రబాబు, లోకేశ్‌పై సభలో తీర్మానం, ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన, జక్కంపూడి రాజా మద్దతు
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేశ్ ప్రవర్తనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మార్షల్స్‌పై దాడి చేయడంపై విచారం వ్యక్తం చేయమని స్పీకర్ సూచించినా.. చంద్రబాబు వినిపించుకోలేదు. ఘటనకు తాను కారణమైతే, ఆపిన మీరు విచారం వ్యక్తం చేయమని చంద్రబాబు ఆనడంతో సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.

సభలో తీర్మానం
మార్షల్స్‌పై చంద్రబాబు నాయుడు, లోకేశ్ ప్రవర్తన సరికాదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సభా గౌరవాన్ని, సంప్రదాయాలను మరింత ఇనుమడింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యుడి అనుచిత ప్రవర్తనపై చర్యలు చేపట్టాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. బుగ్గన తీర్మానం తర్వాత సభలో సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు.

జక్కంపుడి రాజా మద్దతు
తీర్మానంపై జక్కంపూడి రాజా తొలుత మాట్లాడారు. తీర్మానానికి మద్దతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రావాల్సిన గేటు నుంచి రాకుండా మరో గేటు నుంచి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అలా కాకుండా మార్షల్‌పై అనుచితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. చంద్రబాబుకు పౌరుషం లేదని కామెంట్ చేశారు. సిగ్గు, శరం, మానం, మర్యాద, చీము, నెత్తురు లేదని విమర్శించారు.

అందుకే 151 సీట్లు
తమ నేత జగన్ దమ్ము లీడర్ అని పేర్కొన్నారు. పౌరుషం ఉన్న నేత అయినందునే 151 సీట్లు వైసీపీకి వచ్చాయని పేర్కొన్నారు. చంద్రబాబు అంటే కోపగించుకునేవారలో గోరంట్ల బుచ్చయచౌదరి ముందువరసలో ఉంటారని చెప్పారు. ఆయనకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ జరిగిందని ఇటీవల ఇంటికెళ్లి చూసొచ్చానని పేర్కొన్నారు. అయితే అతని ఆపరేషన్ అయ్యేందుకు చంద్రబాబే కారణం అని తెలుసుకొన్నానని చెప్పారు.

బుచ్చయ్యను గిల్లిన చంద్రబాబు
సభలో ఏ అంశంపైనైనా మాట్లాడే సమయంలో లేవంటి అంటూ గిల్లుతారని చెప్పారు. అలా గిల్లడం వల్లే ఆయన ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు.. తన కుమారుడు లోకేశ్‌కే కాక మిగతావారికి కూడా బుద్ధిచెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. అందుకోసమే మార్షల్‌పై లోకేశ్ రెచ్చిపోయాడని చెప్పారు. రాష్ట్రానికి తానే ఎప్పటికీ సీఎం అని చంద్రబాబు భావిస్తుంటే.. తాను సీఎం కుమారుడినని లోకేశ్ భావిస్తున్నారని పేర్కొన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications