RRR: రాజుగారూ వింటున్నారా... స్పీకర్ ఇచ్చిన టాస్క్ ఇదే..!
ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తాత్కాలిక బడ్జెట్ సమర్పించిన తర్వాత స్పీకర్ దీనిపై ఎమ్మెల్యేలకు ఓ కీలక సూచన చేశారు. ఎమ్మెల్యేలంతా బడ్డెట్ పై అవగాహనతో ఉండాలని, ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలు బడ్జెట్ గురించి అన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలని కోరారు. ఈసారి అసెంబ్లీలో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 84 మంది ఉన్నారని అయ్యన్న తెలిపారు. రెండోసారి ఎన్నికైన వారు 39 మంది ఉన్నారని, మిగిలిన వారు మాత్రం పలుమార్లు ఎన్నికయ్యారన్నారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ పై పూర్తి అవగాహన ఉండాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. రేపు బడ్జెట్ పై జరిగే చర్చలో వీరంతా పాల్గొనాలని, అలాగే తప్పనిసరిగా అవగాహన తెచ్చుకుని మాట్లాడాలని కోరారు. రేపు సభకు సెలవు ఉంటుందని, అనంతరం జరిగే చర్చలో పాల్గొనాలని కోరారు. మధ్యలో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణంరాజు ఏదో మాట్లాడబోయారు.

దీనికి స్పందనగా స్పీకర్ అయన్నపాత్రుడు.. రాజుగారూ.. వింటున్నారా మీరు కూడా బడ్జెట్ పై అవగాహన తెచ్చుకుని 13వ తేదీన జరిగే చర్చలో మాట్లాడాలని కోరారు. అందుకే రఘురామ కూడా సరేనన్నారు. దీంతో ఎల్లుండి జరిగే చర్చలో తొలిసారి రఘురామ ప్రసంగం చేయబోతున్నారని అర్ధమైంది. ఇందులో ఆయన బడ్డెట్ లో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ రాజకీయాల ద్వారా లేకపోతే కేసుల ద్వారా వార్తల్లో నిలిచిన రఘురామ ఈసారి బడ్జెట్ ప్రసంగంతో చర్చల్లోకి రానున్నారు.












Click it and Unblock the Notifications