సాయిరెడ్డితో తాడోపేడో...పరువునష్టం నోటీసులు పంపిన కన్నా..
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ వైరస్ పరీక్షలకు వాడుతున్న ర్యాపిడ్ కిట్ల వ్యవహారంలో ఆరోపణలు చేసిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై అనుచిత వ్యాఖ్యలకు దిగిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇరుకునపడ్డారు. 20 కోట్లు తీసుకున్నానంటూ తనపై ఆరోపణలు చేసినందుకు కన్నా పరువునష్టం నోటీసులు పంపారు.
సాయిరెడ్డిపై పరువునష్టం దావా .
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్లు పెట్టడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన సాయిరెడ్డి టీడీపీ నుంచి 20 కోట్లు తీసుకుని వైసీపీ సర్కారుపై బురద జల్లుతున్నారంటూ ఆరోపించారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తన లాయర్ ద్వారా సాయిరెడ్డికి పరువు నష్టం దావా నోటీసులు పంపారు. దీనికి సరైన సమాధానం రాకుంటే కేసు దాఖలు చేసే యోచనలో కన్నా ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video
బీజేపీ హైకమాండ్ దృష్టికి..
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పార్టీ హైకమాండ్ పెద్దలకు వివరణ ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. తన తప్పేమీ లేనందున పరువునష్టం దావా నోటీసులు పంపుతున్నట్లు సమాచారం కూడా ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ర్యాపిడ్ కిట్లపై వైసీపీ ప్రభుత్వంపై తమ పార్టీ నేత కన్నా వ్యాఖ్యలు, ఎంపీ సాయిరెడ్డి ప్రతి విమర్శలపై ఇప్పటికే అధిష్టానం ఆరా తీసింది. దీనిపై కన్నాను మందలించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కన్నా పరువునష్టం నోటీసులు కలకలం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications