వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నా చిన్నకోడలు అనుమానాస్పద మృతి.. ఫ్రెండ్ ఇంటికి వెళ్లి.. ఏపీ బీజేపీ చీఫ్ ఫ్యామిలీలో విషాదం..

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కన్నాలక్ష్మీనారాయణ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కోడలు సుహారిక గురువారం అనుమానాస్పద రీతిలో చనిపోయారు. భర్తతో కలిసి హైదరాబాద్ లో ఉంటోన్న సుహారిక.. మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వచ్చి కుప్పకూలిపోయారు. పరిస్థితిని గమనించిన ఇంట్లోని వారు సుహారికను వెంటనే రాయదుర్గంలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

మృతురాలు సుహారిక.. కన్నా చిన్నకొడుకు ఫణీద్ర సతీమణి. ఈ జంట చాలా కాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం సుహారిక కుప్పకూలిన తర్వాత రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. హైప్రొఫైల్ కేసు కావడంతో సుహారిక కేసును సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మొదటి నుంచి చివరిదాకా అసలేం జరిగిందో కూపీలాగే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. దీనిపై త్వరలోనే అధికారిక పర్యటన వెలువడనుంది.

మీడియాతో సజ్జనార్..

మీడియాతో సజ్జనార్..

మాదాపూర్ లోని మీనాక్షి టవర్స్‌లో కన్నా కోడలి మృతిని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సైతం ఓ చానెల్ కు ధృవీకరించారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులతోపాటు క్లూస్ టీమ్, అనుబంధ విభాగాలు సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం. సుహారిక మరణానికి కారణం కాగల అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. మృతదేహానికి శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుహారిక మృతితో కన్నా కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి.

Recommended Video

Akkineni Nagarjuna, Rajamouli, Trivikram Giving Grossery Kits To Film Workres
ఉండేది గచ్చిబౌలిలో..

ఉండేది గచ్చిబౌలిలో..

వెయిల్ లిఫ్టర్ గా కెరీర్ ప్రారంభించి, రాజకీయ నేతగా ఎదిగిన కన్నా లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దవాడైన కన్నా నాగరాజు తండ్రి బాటలో రాజకీయాల్లోకి ప్రవేశించి, గతంలో గుంటూరు సిటీ మేయర్ గానూ పనిచేశారు. చిన్నవాడైన కన్నా ఫణీంద్రా కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు. పోలో క్రీడలో ఆసియాలోనే టాప్ టీమ్ ను ఫణీద్ర కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సుహారికతో కులాంతర వివాహం తర్వాత వీళ్లు గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో నివసిస్తున్నట్లు తెలిసింది. అలాంటిది, సుహారిక మాదాపూర్‌లో విగతజీవిగా మారడం, దానికి దారితీసిన కారణాలు వెల్లడికావాల్సిఉంది.

English summary
suharika, wife of Kanna Phaneendra, also daughter in law of andhra pradesh bjp state president kanna laxminarayana, died in a suspicious conditions in hyderabad on thursday. cyberabad police registered a case and investigation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X