చంద్రబాబు అరెస్ట్ పై పురందేశ్వరి స్పందన - నిలదీస్తున్న నెటిజెన్లు..!!
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయ కలకలం మొదలైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును విజయవాడ తరలిస్తున్నారు. అదే సమయంలో నాడు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసారు. చంద్రబాబు అరెస్ట్ పైన బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. కానీ, అనూహ్యంగా నెటిజెన్ల నుంచి ఊహించని స్పందన ఎదురవుతోంది.
చంద్రబాబు అరెస్ట్ తో: ఈ రోజు ఉదయం నుంచి చంద్రబాబు అరెస్ట్ వార్త సంచలనంగా మారింది. తెల్లవారు జాము సమయంలోనే పోలీసులు చంద్రబాబును కలిసి అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. వైద్య పరీక్షల తరువాత రోడ్డు మార్గంలో నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. చంద్రబాబు అరెస్ట్ పైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఎటువంటి ఆందోళనలకు దిగకుండా పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్సులను పలు ప్రాంతాల్లో నిలిపి వేసారు. అటు చంద్రబాబు కు బెయిల్ కోసం టీడీపీ న్యాయవాదులు సిద్దం అవుతున్నారు. ఇక, సీపీఐ నేతలు చంద్రబాబు అరెస్ట్ తీరును ఖండించారు.
పురందేశ్వరి స్పందన: చంద్రబాబు అరెస్ట్ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. అందులో.."ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది..." అంటూ పేర్కొన్నారు.
ఇదే సమయంలో పురందేశ్వరి ట్వీట్ పైన నెటిజెన్లు రియాక్ట్ అయ్యారు. పలు ప్రశ్నలు సంధించారు. పురందేశ్వరిని నిలదీస్తున్నారు. బీజేపీ సహకారం లేకుండానే చంద్రబాబు అరెస్ట్ నిర్ణయం జరిగిందా అంటూ నిలదీస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ ను తప్పు బట్టటం ఏంటంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది.
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) September 9, 2023
నెటిజెన్ల రియాక్షన్: చంద్రబాబుకు ఐటీ నోటీసులు వస్తే ఎందుకు స్పందించలేదని మరి కొందరు పురందేశ్వరిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేత తరహాలో ఎందుకు స్పందిస్తున్నారంటూ వైసీపీ మద్దతు దారులు పురందేశ్వరిని నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ మద్దతు లేదంటే నమ్మలేమని మరి కొందరు పోస్టింగ్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తీరు సంచలనంగా మారుతోంది.
దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. స్కాం జరిగినట్లుగా పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని సజ్జల చెప్పుకొచ్చారు. ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర పైన సీఐడీ -ఈడీ పూర్తి ఆధారాలు సేకరించిందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications