పవన్ కల్యాణ్ పై ఢిల్లీ బీజేపీ లీడర్స్ క్లారిటీ - నెక్స్ట్ ఇదే..!!
జనసేనతో పొత్తు పైన బీజేపీ ఢిల్లీ నేతలు స్పష్టతకు వచ్చారు. ఏపీలో తమ వ్యూహంపై సోము వీర్రాజు స్పష్టత ఇచ్చారు.
ఏపీలో బీజేపీ - జనసేనతో పొత్తులో ఉంది. కానీ, జనసేన ఏ పార్టీతో పొత్తు కోరుకుంటోంది. ఎన్నికల సమయంలో ఎవరు ఎవరితో కలుస్తారు. కొద్ది రోజులగా ఏపీ రాజకీయాల్లో అంతర్గతంగా క్లారిటీ ఉన్నా.. అధికారికం గా మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఒక స్పష్టమైన అంచనాకు వచ్చింది. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలోనే ఏపీలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ స్పష్టత ఇచ్చింది. కానీ, పవన్ కల్యాణ్ తాము బీజేపీతో పొత్తులో ఉన్నామంటూ చేస్తున్న వ్యాఖ్యలతో కాషాయం పార్టీ నేతలు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆసక్తి కర చర్చ మొదలైంది.
ఏపీలో ప్రస్తుతానికి బీజేపీ - జనసేన పొత్తు కొనసాగుతోంది. ఇది నామమాత్రమే. రెండు పార్టీలు కలిసి చేసిన పోరాటం ఒక్కటి లేదు. ఇక ఉండే అవకాశమూ కనిపించటం లేదు. ఇదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. అధికారికంగా ప్రకటించికపోయినా బీజేపీతో సహా అన్ని పార్టీలతో పాటుగా అధిక శాతం మంది అంగీకరిస్తున్న విషయం. కానీ, టీడీపీతో పొత్తు ఖాయమని ప్రచారం మొదలైన వేళ జనసేనాని తాము బీజేపీతోనే కలిసి ఉన్నామని గట్టిగా చెబుతున్నారు. టీడీపీ ప్రస్తావన మాత్రం తీసుకురావటం లేదు. దీంతో..పవన్ వైఖరి పైన బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. టీడీపీ - బీజేపీతో కలిసి పవన్ పొత్తు కోసం చేస్తున్న ప్రయత్నాలను కమలం పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీతో కలిసే అవకాశమే లేదని బీజేపీ తేల్చి చెప్పింది. బీజేపీ తమతో కలవకపోయినా..వైసీపీకి అండగా నిలిస్తే ఓట్ల పరంగా కంటే.. ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో అధికార పార్టీకి మేలు జరుగుతందనేది టీడీపీ - జనసేన ఆందోళన.

అటు బీజేపీతో బంధం తెంచుకోలేక..టీడీపీతో పొత్తు పైన అధికారికంగా స్పష్టత ఇవ్వలేక పవన్ అస్పష్ట వైఖరితో ఉన్నారు. అటు టీడీపీ కూడా బీజేపీతో పొత్తు కోసం మరి కొంత కాలం వేచి చూసే ధోరణి అమలు చేస్తోంది. బీజేపీ మాత్రం టీడీపీతో వేదిక పంచుకొనే అవకాశం లేదని గట్టిగా చెబుతోంది. పవన్ ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు లేదా, ఒంటరి పోరు లేదా కలిసొచ్చే పార్టీలతో పొత్తు అంటూ మూడు ఆప్షన్లు చెప్పటం తో బీజేపీ కూడా అదే బాటను ఎంచుకుంది. తమకు జనసేనతో పొత్తు ఉంటుందని..లేకుంటే జనంతో పొత్తు ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్య వెనుక చాలా అర్దం ఉందని వీర్రాజు చెప్పుకొచ్చారు. జనసేనతో పొత్తు పైన బయట అనేక రకాలుగా ప్రచారం సాగుతోందని..దీని కారణంగానే తాము జనసేనతో పొత్తు లేకపోతే జనంతో పాత్తు అని చెబుతున్నామని..పరోక్షంగా తమ వైఖరి ఒంటరి పోరేనని స్పష్టం చేసారు.
ఇదే సమయంలో సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం పైన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్ లు జరుగుతున్నాయని వివరించారు. గత పార్టీ అదే చేసిందే ఇపపటి అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ,టీడీపీలు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసుగా ఆరోపించారు. ప్రజలను రోడ్ల మీద వదిలేసిన పార్టీలతో మా పొత్తు ఉండదని స్పష్టం చేసారు. తాము రోడ్లు వేస్తే జగన్ అరగ్గొట్టారని.. ఇప్పుడు యువ నాయకుడు ప్రారంభించారని ఎద్దేవా చేసారు. జనసేన ఫ్యామిలీ పార్టీ కాదన్నారు. జనంతో మా పొత్తు అనే మాట చాలా బలమైనదిగా చెప్పుకొచ్చారు. జనం తోనే మా పొత్తు ఆన్న నినాదం మాకు చాలా బలమైనదిని.. ముఖ్యమైనదన్నారు. రాష్ట్రంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని వీర్రాజు చెప్పుకొచ్చారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications