ఎమ్మెల్యే రోజా వీడియో వైరల్.. హత్య కేసులో నారా లోకేశ్ అరెస్టు తప్పదన్న బీజేపీ..

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త నయబ్ రసూల్ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సోషల్ మీడియాలో ''నన్ను కూడా అరెస్టు చేయండి'' హ్యాష్ ట్యాగ్ తో క్యాంపెయిన్ ప్రారంభించడం, మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అధికారులతో వాదులాడటం తదితర ఘటనలపై బీజేపీ ఏపీ శాఖ ఘాటుగా స్పందించింది. స్థానిక ఎన్నికల్లో హింసపై ఒకవైపు జనసేనతో కలిసి పోరాడుతామన్న బీజేపీ... మరోవైపు టీడీపీపైనా సెటైర్ల వర్షం కురిపించింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సంబంధించి బీజేపీ చేసిన వీడియో కూడా వైరల్ అయింది.

'ArrestMeToo' క్యాంపెయిన్ పై లోకేశ్ పోస్టును ప్రస్తావిస్తూ.. టీడీపీ నేత అరెస్టంటూ జరిగితే గనుక అది హత్య కేసులోనే జరగాలని, తెలుగు భాషను దారుణంగా చంపేసిన లోకేశ్ ముమ్మాటికీ అరెస్టు కావాల్సిన వ్యక్తేనని ఏపీ బీజేపీ సెటైర్లు వేసింది. ''లోకేశ్ బాబు అరెస్టు తప్పదనుకుంటే అది కచ్చితంగా హత్య కేసుకు సంబంధించినదై ఉండాలి. అవును. తెలుగు భాషను ఖూనీ చేసినందుకు ఆయన అరెస్టు కావాల్సిందే. గత ఐదేళ్ల పాలనలో చేసిన దోపిడీలకు కూడా బాధ్యత వహించాల్సిందే''అని మండిపడింది.

ap bjp slams tdp leader nara lokesh and ysrcp mla roja over local body elections

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సమర్థించాలో, వ్యతిరేకించాలో అర్థంకాక అధికార వైసీపీ నేతలు డోలాయమానంలో పడిపోయారని బీజేపీ ఎద్దేవా చేసింది. పొద్దున ఒకలా, సాయంత్రం మరొకలా మాట్లాడిన వైసీపీ నేతలను చూసిన ప్రజలు.. సీఎం జగన్ రివర్స్ రాజకీయాలను గుర్తుచేసుకుంటున్నారని, పరిపాలన తెలియకున్నా.. కనీసం ఏం మాట్లాడాలో కూడా వైసీపీ నేతలకు రాకపోవడం హాస్యాస్పదమని బీజేపీ విమర్శించింది. దీనికి సంబంధించి..

స్థానిక ఎన్నికల్ని ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేసిన ప్రకటనపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఉదయం ఒకలా స్పందించి.. గంటల వ్యవధిలోనే అవే దుస్తుల్లో మాట మార్చిన వైనాన్ని ఏపీ బీజేపీ వీడియో ఎడిటింగ్ చేసింది. తొలుత కరోనా వైరస్ ప్రభావం వల్లే ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఎన్నికల్ని వాయిదా వేశారని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని చెప్పిన ఎమ్మెల్యే రోజా... కొద్ది సేపటికే మరో చోట మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రలో భాగంగా ఆయన మనిషైన రమేశ్ కుమార్ దురుద్దేశపూర్వకంగా ఎన్నికల్ని వాయిదా వేశారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+