AP Budget sessions 2025: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. ఆ శాఖకే ప్రధాన కేటాయింపులు ..!!

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఏపీకి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రెండవసారి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇక ఎప్పటిలాగానే వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.

2024 జూలైలో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా చూసుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3.22 లక్ష కోట్లతో బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే కూటమి ప్రభుత్వం చేసిన కేటాయింపులపై పయ్యావుల కేశవ్ వివరించారు. ఇక అంతా ఎదురుచూస్తున్న తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి బడ్జెట్‌లో కనిపించాయి. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు కేటాయించారు. ఏపీ బడ్జెట్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

AP Budget Session 2025 Live Updates Sector Wise Allocations Announcements in telugu

Feb 28, 2025, 12:04 pm IST

విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు
Feb 28, 2025, 12:04 pm IST

నీటివరనరుల శాఖకు రూ.12,903.41 కోట్లు
Feb 28, 2025, 12:03 pm IST

ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు కేటాయింపు
Feb 28, 2025, 12:02 pm IST

ఉపాధి హామీకి రూ. 6,026.87 కోట్లు
Feb 28, 2025, 12:01 pm IST

ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.12,773.25 కోట్లు కేటాయింపు
Feb 28, 2025, 12:01 pm IST

ఏపీ ఫిషరీస్ వర్సిటీకి రూ. 38 కోట్లు కేటాయింపు
Feb 28, 2025, 12:00 pm IST

ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి రూ.154.57 కోట్లు కేటాయింపు-అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:53 am IST

875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం-అచ్చెన్నాయుడు.
Feb 28, 2025, 11:52 am IST

రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ. 250 కోట్లు కేటాయింపు-అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:51 am IST

వ్యవసాయం యాంత్రీకరణకు రూ.219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు కేటాయింపు
Feb 28, 2025, 11:50 am IST

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు రూ.9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1023 కోట్లు కేటాయింపు
Feb 28, 2025, 11:49 am IST

డ్రోన్ల రాయితీ కోసం రూ. 80 కోట్లు కేటాయింపు
Feb 28, 2025, 11:48 am IST

భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నాం-అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:47 am IST

బడ్జెట్‌పై ప్రతి సభ్యుడికి పూర్తి అవగాహన రావాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత అందిరిపై ఉంది. పూర్తి అవగాహనతో బడ్జెట్‌పై చర్చ జరగాలి- స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Feb 28, 2025, 11:45 am IST

ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ.61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు కేటాయింపు
Feb 28, 2025, 11:44 am IST

వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం- అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:44 am IST

35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశాం-అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:40 am IST

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 13,487 కోట్లు కేటాయింపు
Feb 28, 2025, 11:38 am IST

రూ.48,341.14 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
Feb 28, 2025, 11:34 am IST

2025-26లో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించేందుకు లక్ష్యం పెట్టుకున్నాం- అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:34 am IST

తమ ప్రభుత్వం 2024-25లో రూ.13.09 కోట్లతో 4.30 లక్షల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించాం- అచ్చెన్నాయుడు.
Feb 28, 2025, 11:32 am IST

గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది-అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:31 am IST

ప్రజల తలసరి ఆదాయం 43 వేల డాలర్లుగా సాధించాలని ప్రభుత్వ లక్ష్యం- అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:30 am IST

స్వర్ణాంధ్ర 2047 మార్గనిర్దేశక 10 సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ వ్యవసాయనికి చెందిన సూత్రం-అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:29 am IST

వికసిత్ భారత్ 2047కు అనుసంధానంగా మన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తాం-అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:28 am IST

రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం- అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:18 am IST

దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం - అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:16 am IST

వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
Feb 28, 2025, 11:07 am IST

పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ. 605 కోట్లు బడ్జెట్‌లో కేటాయింపు
Feb 28, 2025, 11:00 am IST

ఎన్డీఆర్ భరోసా పెన్షన్లు రూ. 27,518 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు కేటాయింపు.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+