ఏపీ కేబినెట్ మీట్ - వాలంటీర్లు, సూపర్ సిక్స్ పై కీలక నిర్ణయం..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తొలి హాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా అయిదు సంతకాల హామీలకు ఆమోద ముద్ర వేయటంతో పాటుగా వాలంటీర్ల వ్యవస్థ..అమరావతి..పోలవరం తో పాటుగా శ్వేత పత్రాల పైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

తొలి మంత్రివర్గ భేటీ
ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశం పై ఈ రోజు జరుగుతోంది. ఈ భేటీలో మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, సామాజిక భద్రతా పింఛన్లు 3000 నుంచి 4 వేలకు పెంపు, ఇతర కేటగిరిలలో కూడా రెండింతలు, మూడింతల పెంపు, రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్‌లకు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడనుంది. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్‌లో నిర్ణయం జరగనుంది. అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్‌లో ఆమోదముద్ర పడనుంది.

AP Cabient to take decisions over Volunteers and implementation of super six Assurances

యూనివర్సిటీ పేరు మార్పు
వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు అంశంపై చర్చ జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పేందుకు శ్వేత పత్రాలు విడుదల చేయనున్నారు. మొత్తం ఎనిమిది అంశాల్లో శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ శ్వేత పత్రాల రూపకల్పనపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మంత్రుల కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌లతో కమిటీ వేసే అవకాశం ఉంది.

వాలంటీర్ల పై నిర్ణయం
ఇక వాలంటీర్ల వ్యవస్థ గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు రాజీనామా చేయగా..తిరిగి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వాలంటీర్ల కొనసాగింపు..కొత్తగా భర్తీ పైనా ఈ మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక..అమరావతి ప్రస్తుత పరిస్థితి..న్యాయపరంగా సమస్యల పరిష్కారం..కేంద్ర సాయం..ప్రభుత్వ కార్యాచరణ గురించి సీఎం వివరింే ఛాన్స్ ఉంది. ఇక..రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగుల బదిలీ అంశం పైన నేటి కేబినెట్‌లో కమిటీ పై తుది నిర్ణయం జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+