ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పీఆర్సీ ఏర్పాటు - జీపీఎస్ కు ఆమోదం..!!
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12వ వేతన సంఘం నియమిస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లు ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అదే సమయంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు పైన ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన కాలపరమితి ప్రకటించింది. అమ్మఒడి ఈ నెల 28న అమలుకు నిర్ణయించారు.
సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ భేటీ..!!#YSJagan #CMJagan #YSJaganCabinet #ApCabinetMeeting #ApCabinet #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/s1Grgj2Fie
— oneindiatelugu (@oneindiatelugu) June 7, 2023
నూతన పీఆర్సీ ఏర్పాటు:
ఏపీలో ఉద్యోగ సంఘాల డిమాండ్ల పైన ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏపీ ఉద్యోగులకు ఈ ఏడాది జూలై నాటికి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. తాజాగా ప్రభుత్వం నూతన వేతన సవరణ సంఘం ఏర్పాటుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎంఓ ఆర్దిక శాఖకు సూచంచింది.

ఈ రోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నూతన పీఆర్సీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. నిర్దిష్ట కాలపరమితి విధించారు. నివేదిక ఆలస్యం అయితే ప్రభుత్వం ఐఆర్ చెల్లించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పటికే ఇచ్చిన హామీ మేరకు 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఆ తరువాత పీఆర్సీ పైన చర్చలతో అమల్లోకి తీసుకొచ్చారు.
సీపీఎస్ స్థానంలో జీపీఎస్:
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల హామీగా ఉన్న సీపీఎస్ రద్దు పైనా కొంత కాలంగా చర్చలు సాగుతున్నాయి. సీపీఎస్ రద్దు స్థానంలో గ్యారంటీ పెన్షన్ స్కీంను ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని ఉద్యోగ సంఘాలు తొలుత వ్యతిరేకించాయి. ఆ తరువాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాల సూచనలతో ఇదే విధానానికి కొన్ని మార్పులు చేసింది.
పాత ఫించను పథకానికి సమానండే ఉండే పథకాన్ని రూపకల్పన చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా కొత్త విధంగా కొత్త బిల్లును రూపొందించారు. గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023 పేరుతో సీపీఎస్ ఉద్యోగుల కోసం బిల్లు ముసాయిదాను కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం. దీని ద్వారా పీఆర్సీ వర్తించే అవకాశం ఉండదు.

ఉద్యోగుల క్రమబద్దీకరణ:
ఇక, ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2014,జూన్ 2 నాటికి అయిదేళ్లు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వారిని క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ లో ఆమోద ముద్ర లభించింది. ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిల్లో 2024 జనవరిలో రూ 175 కోట్లు..
మిగిలిన సొమ్ము నాలుగేళ్ల కాలంలో 16 విడతలుగా చెల్లించేలా ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల మధ్య చర్చల్లో నిర్ణయం జరిగింది. ఈ వివరాలను అధికారులు మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన అంశా పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. విద్యా కానుకకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం..ఈ నెల 28న అమ్మఒడి నిధుల జమకు ముహూర్తంగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications