స్థానిక ఎన్నికల్లో తేలిన రిజర్వేషన్లు - ఎవరికి ఎన్ని సీట్లు..!!
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పైన స్పష్టత వచ్చింది. అత్యవసరంగా భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం బీసీ రిజర్వేషన్ల అమలు పైన కీలక నిర్ణయం తీసుకుంది. డెడికేటెట్ కమిషన్ సర్వే ప్రకారం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఎనిమిది కేటగిరీల్లో రిజర్వేషన్ల అమలు ఖరారు చేసారు. తగ్గిన చోట పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఇక.. బీసీ వర్గాలకు దక్కే రిజర్వేషన్ల వివరాలను వార్డు నుంచి మేయర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి వరకు ఖరారు చేసారు. అధికారికంగా ప్రభుత్వం ఎన్నికల సంఘానికి నివేదిక పంపనుంది.
ఎట్టకేలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు పైన స్పష్టత వచ్చింది. బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్ల అమలు పైన సుప్రీంకోర్టు తీర్పు తరువాత ప్రభుత్వం వేగంగా స్పందించింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్ భేటీలో డిసైడ్ అయ్యారు. పంచాయతీ వార్డు మెంబెర్స్‌లో బీసీలకు 26.73 శాతం, సర్పంచుల్లో బీసీలకు 27.95శాతం, ఎంపీటీసీ 25.55 శాతం, ఎంపీపీల్లో బీసీలకు 24.60 శాతం, జడ్పీటీసీ 24.60 శాతం, జడ్పీ ఛైర్మన్ 23.08 శాతం, అర్బన్ వార్డు 32.78 శాతం, మున్సిపల్ ఛైర్మన్‌లలో 33.02 శాతం, మేయర్లలో బీసీలకు 35.29 శాతం మేర మంత్రివర్గం రిజర్వేషన్లు ఖరారు చేసింది. అదే విధంగా రాష్ట్రంలో బీసీలకు వచ్చే రిజర్వేషన్ల వివరాల పైనా స్పష్టత వచ్చింది.

బీసీ రిజర్వేషన్లు పదవుల వారీగా ఖరారు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పంచాయితీ వార్డు మెంబర్లు 1,33,910 సీట్లకు కు బీసీలకు 30,315 సీట్లు రిజర్వ్ కానున్నాయి. సర్పంచ్ లలో 13,351 గ్రామాల్లో 3128 సీట్లు బీసీలకు కేటాయించనున్నారు. ఎంపీటీసీలు..మొత్తం 9913 లో బీసీలకు 2400 సీట్లు బీసీల కు కేటాయించారు. అదే విధంగా ఎంపీపీలు మొత్తం 661 స్థానాలకు 152 స్థానాల్లో బీసీలకు రిజర్వ్ కానున్నాయి. జెడ్పీటీసీ లు మొత్తం 661 స్థానాలకు 152 స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్ ద్వారా దక్కనున్నాయి. ఇక.. జిల్లా పరిషత్ చైర్మన్ 28 స్థానాలకు 7 స్థానాలు బీసీలకు కేటాయింపు జరగనున్నాయి. మున్సిపల్ వార్డులు మొత్తం 3884 స్థానాల్లో 1273 సీట్లు బీసీలకు రిజర్వేషన్ కింద కేటాయించనున్నారు. మున్సిపల్ ఛైర్మన్ లు.. మొత్తం 106 కు గాను 35 సీట్లు బీసీలకు దక్కనున్నాయి. కార్పోరేషన్ మేయర్లు 17 కు గాను..6 మేయర్లు బీసీలకు 35.29 శాతం రిజర్వేషన్లు ఖరారుతో దక్కనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.













Click it and Unblock the Notifications
