స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పై ప్రభుత్వం ఊహించని నిర్ణయం..!!
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీసీ రిజర్వేషన్ల పైన సుప్రీంలో ఏపీ ప్రభుత్వ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో.. రిజర్వేషన్ల అమలు పైన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. ఈ రోజు కేబినెట్ అత్యవసర సమావేశం జరగనుంది. ఇందులో బీసీ రిజర్వేషన్ల అమలు పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు ఎన్నికల పైన కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం తీర్పు తరువాత ఏపీ ప్రభుత్వం వ్యూహం మార్చింది.
ఎన్నికల నిర్వహణకు సుప్రీం ఆదేశించటంతో.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆలోన చేస్తోంది. ఇందు కోసం రాష్ట్ర మంత్రివర్గం శనివారం అత్యవసరంగా సమావేశమవుతోంది. 50 శాతం రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంటుంది. ఆ వెంటనే పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వేర్వేరుగా రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీచేస్తాయి. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఉత్తర్వులు వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, వార్డులు.. ఇటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఆ తర్వాతే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు.

నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
కాగా.. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. అన్నీ కుదిరితే 12వ తేదీన షెడ్యూలు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. గతంలో మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు రెండు విడతలుగా జరిపారు. అయితే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా, పంచాయతీలకు మూడు విడతల్లో నిర్వహించాలని అభ్యర్థనలు వెలువడ్డాయి. ఈ నెల 16న 'సర్' ప్రక్రియ ముగియనుంది. తుది ఓటర్ల జాబితా విడుదలకు మరో వారం రోజులు పడుతుంది. ఈలోపే నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ రోజు కేబినెట్ లో బీసీ రిజర్వేషన్లు ఖరారయితే.. 2-3 రోజుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్లు సమాయత్తం అవుతున్నారు. దీంతో.. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో తీసుకొనే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.













Click it and Unblock the Notifications
