కేబినెట్ భేటీ: TTD లో కీలక నియామకాలు- మంత్రులకు బిగ్ టాస్క్, విశాఖ కేంద్రంగా..!!

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు సిద్దం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వేళ ఈ భేటీ కీలకంగా మారుతోంది. ఫలితాల విశ్లేషణతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ పైన ఈ భేటీలో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సు పైన ప్రధానంగా చర్చించనున్నారు. అదే విధంగా టీటీడీలో కీలక నియామకాల పైనా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ప్రధానంగా ఈ నెల 12,13 న వైజాగ్ లో జరిగే పెట్టుబడుల సదస్సు విజయవంతం చేసే అంశం పై చర్చించనున్నారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో సదస్సు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సు సక్సెస్ అయ్యేలా
మంత్రులు అందరికి పెట్టుబడుల సదస్సు బాధ్యతలు అప్పగించారు. SIPB సమావేశం లో ఆమోదించిన వివిధ కంపెనీల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అదే విధంగా పలు సోలార్ కంపెనీలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. కాగా.. టీటీడీ లో ప్రధాన గొల్ల సన్నిధి పోస్టు ను నూతనంగా ఏర్పాటు కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
ap-cabinet-meeting-today-investment-summit-preparations-and-local-body-elections-to-be-key-agenda

కేబినెట్ భేటీలో స్థానిక ఫలితాల పై చర్చ

ఇక, టీటీడీలో నూతనంగా ముఖ్యస్థపతి పోస్ట్ ను ఏర్పాటు చేసేందుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, సీఆర్డీఏ అథారిటీ లో ఆమోదించిన పలు అంశాల పైన చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అదే విధంగా తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల పైనా మంత్రివర్గం అధికారిక అజెండా పూర్తయిన తరువాత చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించినా... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల పైన మంత్రి కూటమి లో చర్చ సాగుతోంది. కొన్ని జిల్లాల్లో స్థానిక నేతల తీరు వలనే వైసీపీకి సీట్లు దక్కాయనే అభి ప్రాయం వినిపిస్తోంది. దీంతో.. పంచాయితీ ఎన్నికల పైనా చర్చించనున్నారు. అదే విధంగా విశాఖ సదస్సు నిర్వహణ పైన మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+