ఏపీ కేబినెట్: రైతుల ఖాతాల్లో సుఖీభవ నిధులు - తుఫాను, ఎన్నికలపైనా.. తొలిసారిగా..!!
ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు.. తుఫాను నష్టం.. పాలనా పరమైన వ్యవహారాల పైన కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇప్పటికే మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నిక ల కోసం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఆర్నాబ్ తుఫాను భారీ నష్టం మిగుల్చింది. దీంతో.. మున్సిపల్ ఎన్నికలు 1వ తేదీన యథావిధిగా జరుగుతాయా అనే సందేహం మొదలైంది. ఈ మొత్తం వ్యవహారాల పైన కేబినెట్ చర్చంచి తుది నిర్ణయం తీసుకోనుంది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. తొలి సారి వర్చ్యువల్ విధానంలో ఏపీ మంత్రివర్గం భేటీ అవుతోంది. స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. మంత్రులు జిల్లాల పర్యటనల్లో ఉన్నారు. అదే విధంగా తాజాగా ఆర్నాబ్ తుఫాను ధాటికి కోనసీమ జిల్లాలు భారీగా దెబ్బ తిన్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల పైన తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాథమికంగా 70 వేల పైచిలుకు హెక్టార్లలో పంట నీటమునిగినట్టు గుర్తించారు. కేంద్ర సాయం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం సైతం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నష్టం అంచనాల పైన అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు. ఈ రాత్రి వరకు వర్షాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ సారి కేబినెట్ భేటీలో తుఫాన్ తో పాటుగా తాజా పరిణామాల పైన చర్చించనున్నారు.

ఈ నెల 30న కేంద్రం పీఎం కిసాన్ నిధులు జమ చేయనుంది. ఏపీ ప్రభుత్వం సైతం పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. అదే విధంగా నవంబర్ 1వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉండటంతో... 30వ తేదీ నుంచే ఈ నెల పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు.
ఇక.. మున్సిపల్, జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. కూటమి సమన్వయం.. జెడ్పీటీసీ ఎన్నికల్లో రెబల్స్ ను పోటీ నుంచి విత్ డ్రా చేయించటం వంటి అంశాల పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. కూటమి పార్టీల విజయం పైన స్పష్టత ఇవ్వనున్నారు. తుఫాను నష్టం.. కేంద్రానికి నివేదిక పైనా కేబినెట్ చర్చించి కేంద్రం నుంచి సాయం కోరనుంది.












Click it and Unblock the Notifications
