హైదరాబాద్ కేంద్రంగా అమిత్ షా పాదయాత్ర..!!
హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ బిగ్ ప్లాన్ సెట్ చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక పైన బీజేపీ గురి పెట్టింది. త్వరలో గ్రేటర్ తో పాటుగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. కాగా, బీజేపీ నాయకత్వం ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జాతీయ స్థాయి కార్యక్రమానికి సిద్దం అవుతోంది.కొంత కాలంగా SIR పై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ధీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహా పాదయాత్రకు సిద్దం అయ్యారు.
హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ హైదరాబాద్ కేంద్రంగా మహాపాదయాత్రకు నిర్ణయించింది. నవంబర్ 2న జరిగే ఈ పాదయాత్ర లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు. 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం' అనే నినాదంతో నవంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది.

ట్యాంక్‌బండ్‌పై స్వామి వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభమై, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకు బిజెపి భారీ వ్యూహంతో ముందుకు వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అడ్డుకోండి అనే శక్తివంతమైన నినాదంతో బిజెపి మహా పాదయాత్రను చేపట్టనుంది.
నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఆరోపణలతో భారీ ర్యాలీకి నిర్ణయించింది. ఆ మరుసటి రోజునే బీజేపీ అధి నాయకత్వం హైదరాబాద్ కేంద్రంగా పాదయాత్రకు డిసైడ్ అయింది. అమిత్ షా స్వయంగా ఈ పాదయాత్రలో పాల్గొని తెలంగాణ రణక్షేత్రంలో బిజెపి శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీంతో.. బీజేపీ అధినాయకత్వం తెలంగాణ కేంద్రంగా తమ టార్గెట్ ఏంటనే సంకేతాలు స్పష్టం చేస్తోంది.
బీజేపీ తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. కాగా.. కాంగ్రెస్ ఓట్ చోరీ డ్రామాకు అమిత్ షా కౌంటర్ ఇచ్చేందుకు ఈ పాదయాత్ర చేపట్టారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశంగా పార్టీ నేతలు చెబుతున్నారు. ట్యాంక్‌బండ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో బీజేపీ సమర శంఖం పూరించేందుకు సిద్దం అయిందని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
