నారాయణ, యనమల ఔట్?: డిసెంబర్‌లో క్యాబినెట్‌లో మార్పులు బాబు కేబినెట్లో మార్పులు!

Recommended Video

    AP Cabinet Reshuffle : నారాయణ, యనమల ఔట్?

    అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి క్యాబినెట్ లో భారీగా మార్పులు చేయబోతున్నారు!! డిసెంబర్ లో ఈ మార్పులు వుండే అవకాశం వుంది. ఎన్నికల ఏడాదిలో పడుతున్నందున ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీ వాణి బలంగా వినిపించే వాళ్ళు క్యాబినెట్ లో వుండాలని చంద్రబాబు భావిస్తున్నారట.

    మంత్రివర్గములో స్థానము

    మంత్రివర్గములో స్థానము

    అదే టార్గెట్ ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వుండబోతోంది. అనంతపురం జిల్లా నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి,వెస్ట్ గోదావరి నుంచి చింతమనేని ప్రభాకర్, ఒంగోలు నుంచి గొట్టిపాటి రవికి మంత్రివర్గములో స్థానము కలిపించనున్నారట.

     చంద్రబాబు కుడిభుజం

    చంద్రబాబు కుడిభుజం

    చంద్రబాబు కుడిభుజం అనుకున్న పి నారాయణ మంత్రివర్గం నుంచి పక్కనబెట్టి పార్టీ కార్యక్రమాలకే పరిమితం చేసే అవకాశం ఉంది ఇక పార్టీలో బాగా సీనియర్ గా పేరుండి, చంద్రబాబు దగ్గరకు ఎప్పుడైనా వెళ్లగలిగే స్థాయి వున్న ఎనుమల రామకృష్ణడు ని కూడా క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం వుంది. ఈయనకు రాజ్య సభ ఛాన్స్ దక్కుతుందట.

    చింతమనేని ప్రభాకర్

    చింతమనేని ప్రభాకర్

    ఇక పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు పడ్డ చింతమనేని ప్రభాకర్ కు క్యాబినెట్ లో అవకాశం ఈయన వివాదాలకు దగ్గరగా ఉంటారని పేరు ఉన్నప్పటికీ పార్టీ అంశంలో అంకిత భావమే ఆయనకు ఛాన్స్ దక్కేలా చేస్తోందట.

     2019 ఎన్నికల దృష్టితో

    2019 ఎన్నికల దృష్టితో

    ఇక వైసీపీ నుంచి పార్టీలో చేరిన ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికి వచ్చే క్యాబినెట్ లో బెర్త్ దొరకవచ్చని తెలుస్తోంది. ఈయనకు యువనేత లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసినప్పుడు పార్టీలో కొత్త తరానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్ లో మార్పులు తర్వాత ప్రజలు కూడా ఇలాగే భావించేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల దృష్టితో చేస్తున్న ఈ మార్పుల నుంచి చంద్రబాబు భారీగా రాజకీయ ప్రయోజనం వుండాలని ఆశిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+