మహిళలకు ఉచిత ప్రయాణం మార్గదర్శకాలు - కేబినెట్ లో కీలక నిర్ణయాలు..!!
ఏపీ మంత్రివర్గం కీలక భేటీ కొనసాగుతోంది. పలు అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ పధకానికి మార్గ దర్శకాలు ఖరారయ్యాయి. కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతి రెండో విడత భూ సమీకరణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా సంస్థలకు భూముల కేటాయింపు నిర్ణయాలకు ఆమోద ముద్ర తో పాటుగా మంత్రులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఉచిత ప్రయాణం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మార్గదర్శకాలు ఖరారయ్యాయి. రాష్ట్ర పరిధిలో ఏపీ మహిళ లకు ఈ పథకం అమలు కానుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా ఆర్టీసీ బస్సుల్లో ఈ పథకం అమలుకు నిర్ణయించారు. విద్యార్థినులు ప్రత్యేకంగా పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఏపీ పరిధిలో ఉంటున్నట్లుగా ఏదైనా గుర్తింపు పొందిన కార్డు ద్వారా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. జీరో టికెటింగ్ విధానం ద్వారా ఈ పథకం వినియోగించుకునేలా నిర్ణయం తీసుకున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్‌లలో కూడా ఈ పథకం అమలులో ఉండనుంది. ఈ నెల 9న రాఖీ పూర్ణిమ నాడు పథకం అమలు పైన ప్రభుత్వం ప్రకటన చేయనుంది.. 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

కొత్తగా హోటళ్లు
అదే విధంగా అలాగే 22 ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ హోటళ్లు, ఆరు క్లస్టర్ల పరిధిలోని రిసార్టుల ఆపరేషన్లకు సంబంధించి ఏజెన్సీల ఎంపికకు వీసీ అండ్ ఎండీకి అనుమతులు మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలం పేరూరు లో 25 ఎకరాల భూమికి బదులుగా గతంలో ఓబెరాయ్ హోటళ్ల గ్రూపు నిర్మాణానికి ఇచ్చిన టీటీడీ ల్యాండ్ బదిలీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీని పవర్ సెక్టార్‌కు ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
పథకాలు అమలు
వీటితో పాటుగా హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచే అంశంపై మంత్రిమండలిలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీఎస్సీడీసీఎల్, ఏపీసీపీ డీసీఎల్‌లకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వరసగా రూ.3,545 కోట్లు, రూ.1029 కోట్లు మంజూరు చేసిన రుణానికి గానూ ప్రభుత్వ గ్యారెంటీపై కేబినెట్ చర్చించనుంది. పాఠశాల విద్యలో పలు జీవోలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కాంప్రీహెన్సివ్ ఏపీ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025కు కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) దాని అనుభంద సంస్థలు, రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్‌లపై మరో ఏడాదిపాటు నిషేధం పొడిగిస్తూ మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications