సీఎం జగన్ అలర్ట్, మంత్రులకు పిలుపు- కీలక నిర్ణయాలు..!!

ఢిల్లీ కేంద్రంగా సమీకరణాలు మారుతున్నాయి. ఏపీ సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. తాజా ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. పార్లమెంట్ కు ముందస్తు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలోనూ షెడ్యూల్ కంటే రెండు నెలల ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏపీలో బీజేపీ మూడ్ స్పష్టం అవుతోంది. దీంతో...మంత్రులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.

మంత్రివర్గ సమావేశం
ఈ నెల 11న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజెండా సిద్దం చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సూచించారు. ఈ సమావేశంలో పాలనా పరంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాల్లో కొత్త లబ్దిదారులకు అవకాశం..జనవరి 1 నుంచి పెన్షన్ మూడు వేలకు పెంపుకు ఆమోదం ఇవ్వనున్నారు.ఇక ఏపీలో ఉద్యోగాల భర్తీ పైన ప్రభుత్వం పోకస్ చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా కొత్త ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నిర్ణయానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నుంచి పాలన పైన చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెలలోనే విశాఖకు సీఎం జగన్ మకాం మార్చే ఛాన్స్ ఉంది.

AP Cabinet to meet on 11th December may take crucial decisions on Job calender and Welfare Schemes

కీలక నిర్ణయాల దిశగా
పాలనా పరంగా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. డీఎస్సీ పోస్టుల భర్తీ..ఏపీపీఎస్సీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెబుతున్నారు. అదే విధంగా రాజకీయ అంశాలు చర్చకు రానున్నాయి. పార్లమెంట్ కు షెడ్యూల్ కంటే రెండు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలోనూ ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని సీఎం జగన్ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న సురక్ష, సామాజిక బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్ర వంటి వాటి పైనా సమీక్ష చేయనున్నారు.

ఎన్నికల అజెండా
ఇక, టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబు, పవన్ రాష్ట్ర వ్యాప్త ప్రచారం..సభలకు సిద్దం అవుతున్నారు. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ వైఖరి ఎలా ఉన్నా పాజిటివ్ ఓటింగ్ ను సుస్ధిరం చేసకొనేలా జగన్ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ప్రతీ ఇంటికి పార్టీ నేతలు వెళ్లి..ప్రభుత్వం నుంచి అందిన ప్రయోజనాలను వివరించాలని సూచిస్తున్నారు. తాజా తుఫాను ప్రభావం..పంట నష్టం..బాధితులకు సాయం పైనా చర్చించనున్నారు. ఎన్నికలకు వచ్చే రెండు నెలలు కీలకం కావటంతో ప్రభుత్వం..పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+