కేబినెట్ భేటీ - సచివాలయాలు, వాలంటీర్లపై ఫైనల్ డెసిషన్..!!
ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది. పేపర్ లెస్ ఈ కేబినెట్ భేటీని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేయనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. 12 అంశాల ప్రాతిపదికన వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తో పాటుగా సచివాలయాలు...వాలంటీర్ల కొనసాగింపు పైన నిర్ణయం తీసుకోనుంది.
కీలక నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గం మరోసారి కీలక నిర్ణయాలకు సిద్దమైంది. 2014-19లో పేపర్ లెస్ ఈ-కేబినెట్‌ను టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. తిరిగి ఇకపై పేపర్ లెస్ ఈ-కేబినెట్ భేటీ నిర్వహించనుంది. అజెండా మొదలుకుని నోట్స్ వరకు ఆన్‌లైన్ ద్వారానే మంత్రులకు ఏపీ సర్కార్ అందజేయనుంది. కేబినెట్ భేటీలో సెబ్ రద్దు.. ఎక్సైజ్ శాఖ పునర్వ్యస్థీకరణకు కెబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రేషన్ మాఫియాపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.

సెబీ రద్దు
ఎక్సైజ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి బాగోతాలకు కేంద్ర బిందువు.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అని కూటమి సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేయనుంది. దీంతో సెబ్‌ను రద్దు చేసి.. తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం గత కొంత కాలంగా కసరత్తు నిర్వహిస్తోంది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసి ఆ స్థానంలో గతంలో అమల్లో ఉన్న సాంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరించనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
వాలంటీర్ల పైనా
పోలవరం ఎడమ కాలువ పనులు పాత గుత్తేదారులకు ఇస్తూ ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. గ్రామ- వార్డు సచివాలయాల పునర్వ్యస్థీకరణ వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రేషన్ మాఫియాకు అవకాశం కల్పిస్తున్న ఎండియు వాహనాల రద్దు అంశంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కొన్ని శాఖల బదిలీల గైడ్‌లైన్స్ మార్పులు చేర్పులు పైన కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుతో పాటుగా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు..పెండింగ్ వేతనాల పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications