స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల పై కేబినెట్ సంచలన నిర్ణయం..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. సుప్రీం తీర్పుతో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం పైన కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక పైన ఈ ప్రత్యేక భేటీలో చర్చించారు. రాష్ట్రంలో జనాభా లెక్కలను కమిషన్ ప్రభుత్వానికి ఇవ్వటంతో.. ఆ లెక్కల ఆధారంగా రిజర్వేషన్ల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు రిజర్వేషన్ల అమలు పైన జీవో లు జారీ చేయనున్నారు. ఎన్నికల రిజర్వేషన్ల పై ఉత్తర్వులు జారీ కాగానే.. షెడ్యూల్ జారీ పైన ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. కాగా.. ఈ కేబినెట్ భేటీకి వ్యక్తిగత కారణాలతో జనసేన మంత్రులు హాజరు కాలేదు.
స్థానిక ఎన్నికల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల అమలు పైన కేబినెట్ నిర్ణయానికి వచ్చింది. అత్యవసరంగా సమావేశమైన కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై సమగ్ర సమాచారాన్ని అధికారులు ముందుంచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని అధికార యంత్రాంగం పేర్కొంది. సమకాలీన డేటా, ప్రస్తుత స్థానిక పరిస్థితులు, జనాభా ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు ఖరారు చేయాలని స్పష్టం చేసింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో 'ట్రిపుల్ టెస్ట్' తప్పనిసరిగా నిర్దేశిస్తూ పలు కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించింది. ట్రిపుల్ టెస్ట్ పూర్తి చేయకపోతే, SC, STలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన అనంతరం, మిగిలిన అన్ని స్థానాలను జనరల్ కేటగిరీగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసిందని ప్రభుత్వం చెబుతోంది.

కేబినెట్ నిర్ణయం.. రిజర్వేషన్లు
రిటైర్డ్ IAS అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన స్వతంత్ర ప్రత్యేక కమిషన్‌ను సర్కార్ ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది మార్చి 23 నుంచి కమిషన్ పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, వివిధ బీసీ కుల సంఘాల నుంచి విజ్ఞప్తులు, అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. దాదాపు 7 నెలల పాటు విస్తృతంగా, సమగ్రంగా వివిధ స్థాయిల్లో అధ్యయనం నిర్వహించిన అనంతరం 2026, ఆగస్టు14న ప్రభుత్వానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను సమర్పించింది.













Click it and Unblock the Notifications
