పెట్టుబడులు: సింగపూర్‌లో బాబుపై పొగడ్తలు (పిక్చర్స్)
హైదరాబాద్: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణాసియా దేశాల పైన అంతర్జాతీయ సదస్సులో కీలకోపన్యాసం చేశారు. సింగపూర్ అబివృద్ధి సామాన్యుడి గతిని మారిచందన్నారు. పీవీ నరసింహా రావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో భారత్ ప్రగతి బాట పట్టిందన్నారు.
25ఏళ్ల తర్వాత భారత్‌లో నరేంద్ర మోడీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని, దేశం ప్రగతి దిశలో సాగుతోందన్నారు. అవినీతి, అసమర్థ పాలనతో పదేళ్లు అభివృద్ధి కుంటుబడిందన్నారు. ఏపీలో వెయ్యి కిలోమీటర్ల మేర సముద్రం విస్తరించి ఉందని, పెట్టుబడుల సమీకరణ కోసమే సింగపూర్ వచ్చామన్నారు. సింగపూర్ చిన్న దేశమైన మంచి ప్రగతి సాధించిందని కొనియాడారు.
ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. గురువారం చంద్రబాబు సింగపూర్ ఉప ప్రధాని ధర్మన్ షణ్ముగరత్నంతో పాటు, మాజీ ప్రధాని గోచోటాంగ్, ఎయిర్ లైన్ ఆపరేటర్లు, సింగపూర్ గృహాభివృద్ధి బోర్డు, నివాసయోగ్య నగరాల అధ్యయన కేంద్రం నిపుణులతో వేర్వేరుగా భేటీ అయ్యారు.

చంద్రబాబు
విశాఖలో బాక్సైట్, గోదావరి జిల్లాల్లో బొగ్గు నిక్షేపాలు, రాయలసీమలో సున్నపురాయి, ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నాయని, వీటి ఆధారంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఒకవైపు చెన్నై - బెంగళూరు, మరోవైపు చెన్నై - విశాఖ పారిశ్రామిక కారిడార్లు వస్తున్నందున ఏపీ పారిశ్రామిక కూడలిగా మారే అవకాశముందన్నారు.

చంద్రబాబు
రాష్ట్రంలో స్మార్ట్ సిటీల అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. వ్యవసాయ ప్రధాన ఏపీలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. చంద్రబాబు గురువారం వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. విమానాశ్రయాలు, ఉపరితల రవాణా, గృహ నిర్మాణాభివృద్ధి పైన చర్చించారు.

చంద్రబాబు
కాగా, చంద్రబాబు పైన సింగపూర్ ఉప ప్రధాని ధర్మాన్ షణ్ముగరత్నం ప్రశంసలు కురిపించారు. భారత్‌లో ఇటీవల చోటు చేసుకుంటున్న మార్పులు తమ ప్రభుత్వం ఆసక్తిగా పరిశీలిస్తోందని, తమది చాలా చిన్న దేశం కాబట్టి అన్ని అంశాల పైన దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు నాయకత్వ సామర్థ్యంపై విశ్వాసంతోనే ఇక్కడి పెట్టుబడిదారులు ఏపీవైపు చూస్తున్నట్లు చెప్పారు. ఏపీలో సహజవనరులపై అవగాహన ఉందని, త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. చంద్రబాబు సామర్థ్యం పైన విశ్వాసంతోనే పెట్టుబడిదారులు ఏపీవైపు చూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications