తమ అభిమాన హీరో, బెస్ట్ ఫ్రెండ్ ఎవరో స్పష్టం చేసిన జగన్, షర్మిల: జీవితానికి సరిపడే ప్రేమను

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఆరాధించే వ్యక్తి ఎవరో తేల్చి చెప్పారు. తన అభిమాన హీరో, బెస్ట్ ఫ్రెండ్, ఎవరో స్పష్టం చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆరాధకుడని చెప్పారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్.. తన తండ్రితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నాన్నే తన బలం అని చెప్పారు. ఆయన ఆశయాలే తనను నడిపిస్తున్నాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తన తండ్రిని స్మరించుకున్నారు. తన రోల్ మోడల్ ఎప్పటికీ నాన్నేనని చెప్పారు.

రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాన్నే తొలి గురువు..తొలి హీరో.. తొలి మెంటార్ అని తన వ్యాఖ్యానించారు. కష్ట సుఖాలను తండ్రితోనే పంచుకుంటామని అన్నారు. తన పిల్లలకు స్ఫూర్తి నింపడానికి తండ్రి అహర్నిశలు శ్రమిస్తారని చెప్పారు. తన పిల్లలను గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారనీ జగన్ కామెంట్స్ పోస్ట్ చేశారు.

AP Chief Minister YS Jagan: Father is our first and best friend, mentor and hero

నాన్నే తన బలం, ఆదర్శం అని జగన్ అన్నారు. తన జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో తండ్రే తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడని, కష్టకాలంలో అండగా ఉంటాడని అన్నారు. అందరికీ నాన్నే తొలి బెస్ట్ ఫ్రెండ్, మెంటార్, హీరోగా నిలుస్తారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో గడిపిన క్షణాలను జగన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Recommended Video

    AP 10th And Inter Supplementary Exams Cancelled, Grades Will Decide Soon || Oneindia Telugu

    నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువేనని వైఎస్ షర్మిల అన్నారు. ఒక గొప్ప వ్యక్తికి, మహా నేతకు కుమార్తెగా పుట్టినందుకు గర్విస్తున్నానని చెప్పారు. కుమార్తెగా తన తండ్రి గుండెల్లో పెట్టుకొని పెంచారని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకున్నారు. ఒక రాజకీయవేత్తగా పెద్ద బాధ్యతను మోస్తూ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో, తనతో నాన్న గడిపిన క్షణాలు తక్కువే అయినా జీవితానికి సరిపడా ప్రేమను నింపారని అన్నారు. నాన్న ఇచ్చిన స్ఫూర్తి, నమ్మకం మమ్మల్ని నడిపిస్తున్నాయని వైఎస్ షర్మిల అన్నారు. ఎప్పటికీ నాన్నే తనకు రోల్ మోడల్ అని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+