అమరావతి కేసు రీఓపెన్, సీఐడీ కొత్త ట్విస్ట్ - బిగుస్తున్న ఉచ్చు..!!

అమరావతి అసైన్డ్ భూమల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఈ కేసును తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ తాజాగా కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ ముగిసిందని భావిస్తున్న వేళ..మాజీ మంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ ఇచ్చిన ఆధారాలు ఇప్పుడు సీఐడీకి అస్త్రంగా మారాయి. దీంతో, ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది.

అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అసైన్డ్‌ భూముల కేసులో సీఐడీ సరికొత్త ఆధారాలు సేకరించింది. 2021 లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ సీఐడీకి ఫిర్యాదు చేసారు. దీని పైన సీఐడీ విచారణ చేసింది. అసైన్డ్ భూముల కొనుగోలులో నిబంధనలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ మంత్రి నారాయణ..ఇతరులు వ్యవహరించారనే అభియోగాలు నమోదయ్యాయి. వీటి పైన సీఐడీ విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణ జరగకుండా మార్చి 19న హైకోర్టు స్టే ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసారు.

AP CID files petition in Court seek permisssion for Re open Amaravati Asisgned lands cases

క్వాష్‌ పిటిషన్‌పై విచారణ తర్వాత అక్టోబర్‌ 16కు తీర్పు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. అయితే, ఈ వ్యవహారంలో నారాయణకు సంబంధించి ఆధారాలు సీఐడీకి చేరినట్లు తెలుస్తోంది. నారాయణ మరదలు ఈ వ్యవహారానికి సంబంధించి ఆడియో..వీడియోలు సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో, సీఐడీ ఈ కేసును తిరిగి విచారణకు వీలుగా రీ ఓపెన్ చేసేందుకు పిటీషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతితో ఈ వ్యవహారంలో తిరిగి విచారణకు సీఐడీ సిద్దమవుతోంది.

తిరిగి మాజీ మంత్రి నారాయణను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో నారాయణ కు సీఐడీ 41నోటీసులు ఇచ్చింది. నారాయణ కోర్టును ఆశ్రయించారు. ఇక, ఇప్పుడు తిరిగి అసైన్డ్ భూముల వ్యవహారం తెర మీదకు రావటంతో..ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+