పవన్ డిమాండ్ పై తేల్చేసిన చంద్రబాబు-కేబినెట్లోనే ఫుల్ క్లారిటీ..!
ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఓ కీలక సమస్యపై తన అభిప్రాయం చెప్పేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ డిమాండ్ పై చంద్రబాబు మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇకపై అధికారులు పరుగులు పెట్టబోతున్నారు. అయితే పవన్ డిమాండ్లపై చంద్రబాబు స్పందిస్తున్న తీరు మరోమారు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. పవన్ కు చంద్రబాబు ఇస్తున్న ప్రయారిటీ దీంతో మరోసారి వెల్లడైంది.
ఇంతకీ విషయానికొస్తే.. కాకినాడ పోర్టులో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. అక్కడ రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించారు. అంతటితో ఆగకుండా కాకినాడ పోర్టులో జరుగుతన్న అక్రమాలు, పోర్టు భద్రత వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపైనా మండిపడ్డారు. చివరికి కాకినాడ పోర్టు విషయంలో సీబీఐతో లేదా సీఐడీతో దర్యాప్తు చేయించే అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

అన్నట్లుగానే ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని లేవనెత్తారు. కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్న వేల టన్నుల బియ్యం అక్రమ రవాణాపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబుతో చర్చించారు. దీంతో చంద్రబాబు కూడా ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కాకినాడ పోర్టులో జరుగుతున్న అరాచకాలపై సీఐడీతో విచారణ చేయిద్దామని పవన్ సహా మంత్రులకు తేల్చిచెప్పేశారు. అంతే కాదు ఏయే అంశాలపై సీఐడీతో దర్యాప్తు చేయిస్తారో కూడా చెప్పేశారు.
కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రవాణా అవుతున్న అక్రమ బియ్యం వ్యవహారంతో పాటు వైసీపీ హయాంలో ఈ పోర్టు యాజమాన్యం చేతులు మారడం, బెదిరింపులు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, బియ్యం అక్రమ రవాణా సాగిన తీరు.. ఇలా పలు అంశాలపై సీఐడీతో విచారణ చేయిద్దామని మంత్రులకు చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications